పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న మొదటి టెస్టుకు టీమిండియా అన్ని విధాల సన్నదమవుతోంది. ఈ మ్యాచ్‌కు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడంతో బుమ్రా సారథ్యంలో భారత జట్టు ఆసీస్‌ను ఢీకొట్టనుంది.
అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి టీమ్ మేనెజ్‌మెంట్‌కు కీలక సూచనలు చేశాడు. ఆసీస్‌తో తొలి టెస్టుకు యవ ఆటగాడు ధృవ్ జురెల్‌ను స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఎంపిక చేయాలని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.
కాగా ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన ధృవ్ జురెల్ తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయితే స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తిరిగి రావడంతో జురెల్‌కు తుది జట్టులో అవకాశాలు లభించడం లేదు.
స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో సిరీస్‌లకు జురెల్ ఎంపికైనప్పటికి ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే ఈ సిరీస్ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియా-ఎతో తలపడిన మ్యాచ్‌లో భారత్ -ఎ తరఫున రెండు హాఫ్ సెంచరీలతో అదరగొట్టాడు.
ఈ నేపథ్యంలో ఐసీసీ రివ్యూలో శాస్త్రి మాట్లాడుతూ.."తొలి టెస్టుకు ధృవ్ జురెల్‌ను స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఎంపిక చేయండి. అతడికి ఆ సత్తా ఉంది. ఒత్తిడిలో చాలా మంది ఆటగాళ్లు తీవ్ర ఇబ్బంది పడటం మనం చూసి ఉంటాం. మరి కొంతమంది వెంటనే వికెట్‌ను సమర్పించుకుని ఔటవ్వడం చూసి ఉంటాము.
కానీ ధృవ్ జురెల్ కథ మాత్రం వేరు. జురెల్ ఎటువంటి పరిస్థితులోనైనా ప్రశాంతంగా బ్యాటింగ్ చేయగలడు. అతడి కూల్‌నెస్ నాకు బాగా నచ్చింది. అదే అతడి స్పెషల్ కూడా. ఇంగ్లండ్‌తో జరిగిన ఆ సిరీస్‌లో కూడా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అతడెంతో పరిపక్వతను చూపించాడు. కాబట్టి పెర్త్ టెస్టులో అతడు ఆడితే చూడాలనుకుంటున్నాను" పేర్కొన్నాడు.
చదవండి: ఆస్ట్రేలియా అంటే చాలు కోహ్లికి పూనకాలే.. జాగ్రత్తగా ఉండండి: వార్నర్
Comments
Please login to add a commentAdd a comment