బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉండనున్నాడని తెలుస్తుంది. రోహిత్ భార్య రితిక సజ్దే రెండో బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలో అతను పితృత్వ సెలవులో ఇండనున్నట్లు సమాచారం. ఈ పరిస్థితిలో టీమిండియా బ్యాకప్ ఓపెనర్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
రోహిత్ లీవ్ విషయం ముందే తెలిసి టీమిండియా మేనేజ్‌మెంట్ కేఎల్ రాహుల్ బ్యాకప్ ఓపెనర్‌గా ఉపయోగపడతాడని ఆస్ట్రేలియాకు పంపింది. అయితే రాహుల్ ఆసీస్-ఏతో జరిగిన రెండో అనధికారిక టెస్ట్‌లో దారుణంగా విఫలమయ్యాడు. రాహుల్‌తో పాటు మరో బ్యాకప్ ఓపెనర్‌గా పరిగణించబడిన అభిమన్యు ఈశ్వరన్ కూడా రెండు అనధికారిక టెస్ట్‌ల్లో చేతులెత్తేశాడు. వీరిద్దరితో పాటు ఓపెనర్ రేసులో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ సైతం దారుణంగా నిరాశ పరిచాడు.
ఈ నేపథ్యంలో రెండో అనధికారిక టెస్ట్‌లో అద్భుతంగా ఆడిన వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ ధృవ్ జురెల్‌ను రోహిత్‌కు ప్రత్యామ్నాయంగా ఎంపిక చేయాలని అభిమానులు కోరుతున్నారు. యశస్వి జైస్వాల్‌కు జతగా శుభ్‌మన్ గిల్‌ను ఓపెనర్‌గా పంపించి జురెల్‌ను మిడిలార్డర్‌లో ఆడించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఆసీస్‌తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్‌లో అందరూ విఫలమైన వేల జురెల్ సూపర్‌గా బ్యాటింగ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 186 బంతులు ఎదుర్కొని 80 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 47 బంతులు ఎదుర్కొని 19 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఆసీస్‌తో తొలి టెస్ట్ సమయానికి రోహిత్ అందుబాటులో ఉండకపోతే జురెల్‌నే ప్రత్యామ్నాయ ఆటగాడిగా ఎంపిక చేయడం మంచిందని అందరూ అనుకుంటున్నారు. మరి టీమిండియా మేనేజ్‌మెంట్ ఏం చేస్తుందో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment