ఐపీఎల్ 2024 సీజన్‌కు మరో 24 గంటల్లో తెరలేవనుంది. శుక్రవారం(మార్చి 22)న చెపాక్ స్టేడియం వేదికగా చెన్నైసూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ షురూ కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ ఆస్రశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి.
ఇక ఇది ఇలా ఉండగా.. భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ రాజస్తాన్ రాయల్స్ జట్టుకు కీలక సూచనలు చేశాడు. ఆ జట్టు యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ ఇవ్వాలని సన్నీ అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ 2024లో యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ కచ్చితంగా ఆకట్టుకుంటాడు. అతడు ప్రస్తుతం మంచి రిథమ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో అతడు ఏమి చేశాడో మనమందరం చూశాం. గత ఐపీఎల్‌లో కూడా ధ్రువ్ మెరుపులు మెరిపించాడు. కానీ అతడు బ్యాటింగ్‌కు మాత్రం చాలా ఆలస్యంగా వస్తున్నాడు. కాబట్టి ఈ ఏడాది సీజన్‌లో అతడి బ్యాటింగ్ ఆర్డర్‌ను కచ్చితంగా మార్చాల్సిందే.
అతడికి ప్రమోషన్ ఇచ్చి కాస్త ముందు పంపాలని" స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో జురెల్ అదరగొట్టాడు. కీలక ఇన్నింగ్స్‌లతో అందరి ఆకట్టుకున్నాడు. దీంతో అతడికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో సైతం చోటు దక్కింది. అతడితో పాటు సర్ఫరాజ్ ఖాన్‌కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment