న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఘోర వైఫల్యం నేపథ్యంలో టీమిండియా మేనేజ్‌మెంట్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కివీస్‌పై చేసిన తప్పిదాలను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పునరావృతం చేయకూడదని గంభీర్ అండ్ కో భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత జట్టు మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది.
భారత బ్యాటర్లు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్‌లను వారం రోజుల ముందుగానే ఆస్ట్రేలియా పంపాలని డిసైడ్ అయింది. ప్రస్తుతం ఆసీస్ పర్యటనలో ఉన్న భారత-ఎ జట్టుతో వీరిద్దరూ బుధవారం(నవంబర్ 6) కలవనున్నారు. నవంబర్ 7 నుంచి మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-ఎతో జరగనున్న రెండో టెస్టులో రాహుల్, జురెల్ భారత్-ఎ తరపున ఆడే ఛాన్స్ ఉంది.
కాగా స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపికైన రాహుల్ కేవలం ఒకే మ్యాచ్ ఆడాడు. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో విఫలమం కావడంతో మిగితా రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితం చేశాడు. ఈ క్రమంలోనే అతడు ప్రాక్టీస్ కోసం ముందుగానే ఆస్ట్రేలియా గడ్డపై అడగుపెట్టనున్నాడు. రాహుల్‌కు ఆసీస్ గడ్డపై ఆడిన అనుభవం ఉంది. ఆస్ట్రేలియాలో 5 టెస్టులు ఆడిన రాహుల్ 20.77 సగటుతో కేవలం 187 పరుగులు మాత్రమే చేశాడు.
జురెల్ ఇదే తొలిసారి..
మరోవైపు వికెట్ కీపర్ బ్యాటర్ తొలిసారి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నాడు. విదేశీ గడ్డపై ఆడిన అనుభవం జురెల్‌కు లేదు. ఈ నేపథ్యంలోనే అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు ముందుగానే జురెల్‌ను కూడా జట్టు మేనేజ్‌మెంట్ ఆస్ట్రేలియాకు పంపింది. ఇక నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీ కోసం భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది.
ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టు
రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, యశస్వి జైశ్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్‌కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.
చదవండి: Ind vs Aus: కివీస్ చేతిలో టీమిండియా వైట్‌వాష్.. ఆసీస్ స్టార్ కామెంట్స్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment