టీమిండియా నయా సంచలనం దృవ్ జురెల్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రాంచీ టెస్ట్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకోవడం ద్వారా అరంగేట్రం సిరీస్‌లోనే ఈ ఘనత సాధించిన రెండో భారత వికెట్‌కీపర్‌గా రికార్డుల్లోకెక్కాడు. జురెల్‌కు ముందు భారత వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ అజయ్ రాత్రా ఈ ఘనత సాధించాడు. 2002 వెస్టిండీస్ పర్యటనలో రాత్రా.. తన డెబ్యూ సిరీస్‌లోనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
జురెల్ అరంగేట్రం సిరీస్ రెండో మ్యాచ్‌లో ఈ అవార్డు అందుకుంటే.. రాత్రా తన డెబ్యూ సిరీస్‌లోని నాలుగో మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఆంటిగ్వా వేదికగా విండీస్‌తో జరిగిన నాటి మ్యాచ్‌లో రాత్రా సెంచరీ (115) చేసి ఈ అవార్డును దక్కించుకున్నాడు. విశేషం ఏంటంటే, ఆ సెంచరీ తర్వాత రాత్రా కనీసం ఒక్కసారి కూడా హాఫ్ సెంచరీ మార్కును తాకలేకపోయాడు. రాత్రా ఆ ఘనత సాధించిన 22 ఏళ్ల తర్వాత జురెల్ మరోసారి ఆ ఫీట్‌ను రిపీట్ చేశాడు.
ఓవరాల్‌గా చూస్తే.. భారత్ తరఫున టెస్ట్‌ల్లో కేవలం ఆరుగురు మాత్రమే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నారు. వీరిలో ఎంఎస్ ధోని, రిషబ్ పంత్ రెండు సార్లు ఈ ఘనతను సాధించగా.. నయన్ మోంగియా, వృద్దిమాన్ సాహా, అజయ్ రాత్రా, దృవ్ జురెల్ చెరోసారి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచారు. కాగా, రాంచీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో అజేయమైన 39 పరుగులు చేసి జురెల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా స్వల్ప లక్ష్య ఛేదనలో (192) తొలుత తడబాటుకు లోనైనప్పటికీ ఆతర్వాత కుదురుకుని చిరస్మరణీయ విజయం సాధించింది. జురెల్, శుభ్‌మన్ గిల్ (52 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి టీమిండియాను విజయతీరాలకు చేర్చారు.
Comments
Please login to add a commentAdd a comment