విధ్వంసం సృష్టించిన రియాన్‌ పరాగ్‌ | Ranji Trophy 2024: Riyan Parag Smashed 82 Runs From 70 Balls Vs Chhattisgarh | Sakshi
Sakshi News home page

విధ్వంసం సృష్టించిన రియాన్‌ పరాగ్‌

Published Sun, Jan 7 2024 7:21 PM | Last Updated on Sun, Jan 7 2024 7:21 PM

Ranji Trophy 2024: Riyan Parag Smashed 82 Runs From 70 Balls Vs Chhattisgarh - Sakshi

రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో భాగంగా చత్తీస్‌ఘడ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అస్సాం సారధి, ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడైన రియాన్‌ పరాగ్‌ రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్‌లో అతను విధ్వంసం సృష్టించాడు. 40 బంతులు ఎదుర్కొన్న రియాన్‌.. 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. 

ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకే కుప్పకూలిన అస్సాం ఫాలో ఆన్‌ ఆడుతుంది. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లోనూ ఆ జట్టు పేలవ ప్రదర్శన చేస్తుంది. రియాన్‌ పరాగ్‌ తన జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి, 3 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతుంది. 

అస్సాం సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో రిషవ్‌ దాస్‌ 17, రాహుల్‌ హజారికా 39, సుమిత్‌ సుమిత్‌ 16, బిషల్‌ రాయ్‌ 8, దెనిశ్‌ దాస్‌ 0 పరుగులు చేసి ఔట్‌ కాగా.. రియాన్‌, ఆకాశ్‌సేన్‌ గుప్తా (3) క్రీజ్‌లో నిలిచారు. అంతకుముందు సౌరభ్‌ ముజుందార్‌ 5 వికెట్లతో చెలరేగడంతో అస్సాం తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది. రవి కిరణ్‌ 3, వాసుదేవ్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. అస్సాం తొలి ఇన్నింగ్స్‌లో దెనిశ్‌ దాస్‌ (52) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కెప్టెన్‌ అమన్‌దీప్‌ దేశాయ్‌ సెంచరీతో (116) కదంతొక్కడంతో చత్తీస్‌ఘడ్‌  తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌటైంది. శశాంక్‌ సింగ్‌ (82), అశుతోష్‌ (58) అర్ధసెంచరీలతో రాణించారు. అస్సాం బౌలర్లలో ముక్తర్‌ హుస్సేన్‌, మ్రిన్‌మోయ్‌ దత్తా, ఆకాశ్‌సేన్‌ గుప్తా, రాహుల్‌ సింగ్‌, కునాల్‌ శర్మ తలో 2 వికెట్లు పడగొట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement