సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అస్సాం కెప్టెన్ రియాన్ పరాగ్ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా మంగళవారం బెంగాల్‌తో జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్‌లో అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 31 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో తన హాఫ్ సెంచరీతో మార్క్‌ను అందుకున్నాడు.
అస్సాం విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా టోర్నీలో ఇది పరాగ్‌కు 7వ హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. ఇప్పటివరకు ఆడిన 8 ఇన్నింగ్స్‌లలో పరాగ్ 490 పరుగులు చేశాడు. తన కెరీర్‌లోనే భీకర ఫామ్‌లో ఉన్న పరాగ్‌పై ఒకవైపు ప్రశంసల వర్షం కురుస్తుంటే.. మరోవైపు విమర్శల వర్షం కురుస్తోంది.
ఏం జరిగిందంటే?
బెంగాల్‌తో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకోగానే పరాగ్ తనదైన స్టైల్‌లో సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. అయితే అతడి సెలబ్రేషన్స్ శృతి మించాయి. ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్లను పరాగ్ అవమానపరిచాడు. హాఫ్ సెంచరీ సాధించిన వెంటనే పరాగ్ డ్రెస్సింగ్ రూమ్ వైపూ చూస్తూ.. "నేనే అందరికంటే తోపు, నన్నే అపేవారు ఇక్కడ లేరంటూ" సైగలు చేశాడు.
దీంతో పరాగ్‌విమర్శకులకు మరోసారి తోవనిచ్చాడు.. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇప్పటికే చాలా సార్లు పరాగ్ ట్రోల్స్‌కు గురైన సంగతి తెలిసిందే. ఓవరాక్షన్ స్టార్ అంటూ అభిమానులు ఓ ట్యాగ్ కూడా ఇచ్చేసారు.
చదవండి: World cup 2023: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. మ్యాక్స్‌వెల్‌కు ప్రమాదం! తలకు తీవ్ర గాయం
Celebration by Riyan Parag after his 7th consecutive 50 in T20 Cricket.pic.twitter.com/Z6PitN1XYc
— Riyan Parag FC (@riyanparagfc_) October 31, 2023
Riyan Parag celebration myan 😭😭😭.
— HS27 (@Royal_HaRRa) October 31, 2023
He fucking just said, these guy's aren't on my level. I am fucking couple level ahead of them 😭😭😭
Proper Chad pic.twitter.com/Gd8fbECfM7
Comments
Please login to add a commentAdd a comment