
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో రియాన్ పరాగ్ భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్‌లో రియాన్ మూడో హాఫ్ సెంచరీతో మెరిశాడు. గుజరాత్‌తో ఇవాళ (ఏప్రిల్ 10) జరుగుతున్న మ్యాచ్‌లో రియాన్ 34 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో మెరుపు అర్దశతకం బాదాడు. రియాన్ హాఫ్ సెంచరీ మార్కును సిక్సర్‌తో అందుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 48 పరుగులు ఎదుర్కొన్న రియాన్.. 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 76 పరుగులు చేసి ఔటయ్యాడు.
RIYAN PARAG ON FIRE IN IPL 2024. 🤯👌 pic.twitter.com/fincAlQBPh
— Johns. (@CricCrazyJohns) April 10, 2024
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో రియాన్ చేసిన స్కోర్ల వివరాలు..
- 43(29) vs LSG
- 84*(45) vs DC
- 54*(39) vs MI
- 4 (4) vs RCB
- 76 (48) vs GT
ఈ సీజన్‌లో రియాన్ 5 మ్యాచ్‌ల్లో 158.18 స్ట్రయిక్‌రేట్‌తో 87 సగటున 261 పరుగులు చేసి విరాట్ కోహ్లి (316) తర్వాత సీజన్ సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.
రియాన్, సంజూ మెరుపులు.. రాజస్థాన్ భారీ స్కోర్
మ్యాచ్ విషయానికొస్తే.. రియాన్ పరాగ్‌తో పాటు సంజూ శాంసన్ (38 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపులు మెరిపించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో యశస్వి 24, బట్లర్ 8, హెట్‌మైర్ 13 (నాటౌట్) పరుగులు చేశారు. ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీశారు.