
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి రెండు రోజుల ముందు రాజస్థాన్ రాయల్స్‌కు సంబంధింది కీలక అప్‌డేట్ వెలువడింది. ఈ సీజన్ తొలి మూడు మ్యాచ్‌ల్లో రాయల్స్ కెప్టెన్‌గా రియాన్ పరాగ్ వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్ స్వయంగా ప్రకటించాడు. సంజూ పూర్తి స్థాయి ఆటగాడిగా ఫిట్‌నెస్ సాధించకపోవడమే కెప్టెన్సీ తాత్కాలిక మార్పుకు కారణమని తెలిస్తుంది.
SANJU SAMSON ANNOUCING RIYAN PARAG AS ROYALS CAPTAIN IN FIRST 3 GAMES..!!!
- Riyan will lead vs SRH, KKR & CSK. pic.twitter.com/G6F4WYgGD3— Johns. (@CricCrazyJohns) March 20, 2025
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్ సందర్భంగా సంజూ గాయపడిన (కుడి చేతి చూపుడు వేలు) విషయం తెలిసిందే. ఆ గాయం నుంచి పాక్షికంగా కోలుకున్న సంజూ బ్యాటర్‌గా ఫిట్‌నెస్ సాధించినప్పటికీ.. వికెట్‌కీపింగ్‌కు సంబంధించి పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు.
ఈ కారణంగా అతను రాయల్స్ ఆడబోయే తొలి మూడు మ్యాచ్‌ల్లో కేవలం బ్యాటర్‌గానే కొనసాగనున్నాడు. ఈ మూడు మ్యాచ్‌ల్లో సంజూ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగవచ్చు. కేవలం బ్యాటర్‌గా మాత్రమే కొనసాగే అవకాశం ఉండటంతో సంజూ కెప్టెన్సీని రియాన్‌ను అప్పజెప్పాల్సి వస్తుంది. రియాన్ తాత్కాలిక కెప్టెన్‌గా ఉంటాడన్న విషయాన్ని వెల్లడించే సందర్భంగా సంజూ ఇలా అన్నాడు.
"జట్టులో చాలా మంది నాయకులు ఉన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో పలువురు జట్టును అద్భుతంగా ముందుండి నడిపించారు. తదుపరి మూడు మ్యాచ్‌ల్లో రియాన్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. అందరూ అతనికి మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాను"
కాగా, సంజూ ఇవాళ (మార్చి 20) ముంబైలో జరిగే కెప్టెన్ల సమావేశంలో రాయల్స్‌కు ప్రతినిధిగా ఉంటాడు. సంజూ వారం తర్వాత మరోసారి ఫిట్‌నెస్ టెస్ట్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ పరీక్ష కేవలం వికెట్‌కీపింగ్‌కు సంబంధించి మాత్రమే ఉంటుంది.
ఇదిలా ఉంటే, ఈ ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్రయాణం మార్చి 23న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌తో మొదలవుతుంది. ఈ మ్యాచ్ ఎస్‌ఆర్‌హెచ్ హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో (హైదరాబాద్) జరుగనుంది. మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్, ఆర్సీబీ మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభం కానుంది.
రియాన్ పరాగ్ విధ్వంసకర శతకం
ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందే రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు రియాన్ పరాగ్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. నిన్న జరిగిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో రియాన్ 64 బంతుల్లో 10 సిక్సర్లు, 16 ఫోర్ల సాయంతో 144 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఇదే మ్యాచ్‌లో దృవ్ జురెల్ కూడా సెంచరీ చేశాడు. జురెల్ 44 బంతుల్లో 104 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రియాన్, జురెల్ మెరుపు సెంచరీల మధ్య ఇదే మ్చాయ్‌లో యశస్వి జైస్వాల్ కూడా బీభత్సం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో జైస్వాల్ 34 బంతుల్లో 83 పరుగులు చేసి ఔటయ్యాడు.
రాజస్థాన్ రాయల్స్..
సంజూ శాంసన్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, నితీశ్ రాణా, శుభమ్ దూబే, షిమ్రోన్ హెట్‌మైర్, రియాన్ పరాగ్, యుద్ద్‌వీర్ సింగ్ చరక్, వనిందు హసరంగ, దృవ్ జురెల్, కునాల్ సింగ్ రాథోడ్, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే, కుమార్ కార్తీకేయ, ఆకాశ్ మధ్వాల్, క్వేనా మపాకా, మహీశ్ తీక్షణ, ఫజల్ హక్ ఫారూకీ, అశోక్ శర్మ, జోఫ్రా ఆర్చర్
Comments
Please login to add a commentAdd a comment