
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించే యువ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ (అస్సాం).. విజయ్ హజారే వన్డే ట్రోఫీ-2022లో భాగంగా నిన్న (నవంబర్ 12) రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి లిస్ట్-ఏ క్రికెట్‌లో తన తొలి శతకాన్ని నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 84 బంతులు ఎదుర్కొన్న పరాగ్.. 10 ఫోర్లు, 6 భారీ సిక్సర్ల సాయంతో 117 పరుగులు చేసి తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అస్సాం.. రియాన్ పరాగ్ సెంచరీతో కదం తొక్కడంతో 46.5 ఓవర్లలో 271 పరుగులు చేసి ఆలౌటైంది. పరాగ్ మినహా మరే ఇతర బ్యాటర్ రాణించకపోవడంతో అస్సాం తమ కోటా ఓవర్లు కూడా పూర్తిగా ఆడలేకపోయింది. పరాగ్ తర్వాత నెక్స్ టాప్ స్కోరర్‌గా ముక్తర్ హుసేన్ (39) ఉన్నాడు.
అనంతరం 272 పరుగల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్తాన్.. అస్సాం బౌలర్లు మ్రిన్మోయ్ దత్తా (3/34), అవినోవ్ చౌదరీ (3/25), రజాకుద్దీన్ అహ్మద్ (2/25), ముక్తర్ హుసేన్ (1/17) ధాటికి 128 పరుగులకే ఆలౌటైంది (33.3 ఓవర్లలో). ఫలితంగా అస్సాం 143 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
చదవండి: Vijay Hazare Trophy: రోహిత్ రాయుడు, తిలక్ వర్మ సెంచరీలు