PC:IPL.com
రాజస్తాన్ రాయల్స్ యువ ఆటగాడు రియాన్ పరాగ్ తన ఐపీఎల్ కెరీర్‌లోనే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్-2024లో భాగంగా జైపూర్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో పరాగ్ విధ్వంసం స`ష్టించాడు. ఢిల్లీ బౌలర్లను పరాగ్ ఊచకోత కోశాడు. 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన రాజస్తాన్‌ను పరాగ్ తన అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు.
తొలుత కాస్త ఆచితూచి ఆడిన రియాన్.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన అన్రిజ్ నోర్జే బౌలింగ్‌లో పరాగ్ ఏకంగా 25 పరుగులు రాబట్టాడు. అందులో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. కేవలం 45 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 84 పరుగులు చేశాడు.
ఐపీఎల్‌లో అతడికి ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం . అంతేకాకుండా ఇది పరాగ్‌కు 17 ఇన్నింగ్స్‌ల తర్వాత వచ్చిన హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
2019లో ఐపీఎల్‌లో రాజస్తాన్ తరపున డెబ్యూ చేసిన రియాన్ పరాగ్.. ఇప్పటివరకు 56 మ్యాచులు ఆడాడు. వాటిల్లో 727 పరుగులు చేశాడు. అందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే పరాగ్ ఎప్పుడూ తన ఆటతో కంటే తన వింత చేష్టలతోనే ఎక్కువగా వార్తల్లో ఎక్కేవాడు. కానీ ఇప్పుడు ఆటతో కూడా అందరిని ఆకట్టుకుకుంటున్నాడు ఈ అస్సాం ఆల్‌రౌండర్.
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ 43 పరుగులతో అదరగొట్టాడు. ఓవరాల్‌గా రెండు మ్యాచ్‌లు 127 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పరాగ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పరాగ్ 2.O అంటూ కొనియాడుతున్నారు.
https://t.co/b25Pi3Z0SU pic.twitter.com/hLnVRxlfBw
— IndianPremierLeague (@IPL) March 28, 2024
Comments
Please login to add a commentAdd a comment