రంజీ ట్రోఫీ 2024 ఎడిషన్‌లో అస్సాం కెప్టెన్ రియాన్ పరాగ్ పరుగుల వరద పారిస్తున్నాడు. సీజన్‌లో వరుసగా రెండో సెంచరీతో చెలరేగిపోయాడు. చత్తీస్‌ఘడ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కేవలం 87 బంతుల్లోనే 11 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 155 పరుగులు చేసిన రియాన్.. కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో 104 బంతుల్లో బాధ్యతాయుతమైన శతకం బాదాడు.
రియాన్ చేసిన ఈ రెండు శతకాలు తన జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు చేసినవే కావడం విశేషం. చత్తీస్‌ఘడ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫాలో ఆన్ ఆడే సమయంలో శతక్కొట్టిన రియాన్.. కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో తన జట్టు 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో సెంచరీతో ఆదుకున్నాడు. చత్తీస్‌ఘడ్‌పై రియాన్ చేసిన సెంచరీ రంజీ చరిత్రలో రెండో వేగవంతమైన సెంచరీ (56 బంతుల్లో) కాగా.. కేరళపై చేసిన సెంచరీ అతని కెరీర్‌లో చిరకాలం గుర్తుండిపోయేది.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 419 పరుగులకు ఆలౌటైంది. సచిన్ బేబి సెంచరీతో (131) సత్తా చాటగా.. కున్నుమ్మల్ (83), కృష్ణ ప్రసాద్ (80), ప్రేమ్ (50) అర్ధసెంచరీలతో రాణించారు. అస్సాం బౌలర్లలో ముక్తర్ హుసేన్, రాహుల్ సింగ్ చెరో 3 వికెట్లు, సిద్దార్థ్ శర్మ 2, ఆకాశ్‌సేన్ గుప్తా ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అస్సాం 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ రియాన్ పరాగ్ (116) బాధ్యతాయుతమైన సెంచరీతో తన జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు.
అయితే రియాన్ మినహా అస్సాం ఇన్నింగ్స్‌లో ఎవరూ రాణించకపోడంతో ఆ జట్టు మరోసారి కష్టాల్లో పడింది. 212 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కేరళ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 207 పరుగులు వెనుపడి ఉంది. రాహుల్ హజారికా (9), సిద్దార్థ్ శర్మ (0), సుమిత్ (4), గోకుల్ శర్మ (12), సాహిల్ జైన్ (17) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. రిషవ్ దాస్ 31 పరుగులు చేశాడు. ఆకాశ్‌సేన్ గుప్తా (6), ముక్తర్ హుస్సేన్ (6) క్రీజ్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment