భారత్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లో 270/6
భారత్ ‘సి’తో దులీప్ ట్రోఫీ మ్యాచ్
సాక్షి, అనంతపురం: యువ ఆటగాడు రియాన్ పరాగ్ (101 బంతుల్లో 73; 5 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించడంతో భారత్ ‘సి’తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ చివరి రౌండ్ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ‘ఎ’ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 64 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. శాశ్వత్ రావత్ (53; 4 ఫోర్లు, ఒక సిక్సర్), కుమార్ కుషాగ్ర (40 నాటౌట్; 4 ఫోర్లు, ఒక సిక్సర్), కెపె్టన్ మయాంక్ అగర్వాల్ (34) సత్తాచాటారు. భారత్ ‘సి’ బౌలర్లలో అన్షుల్ కంబోజ్, గౌరవ్ యాదవ్, మానవ్ సుతార్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 216/7తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ‘సి’ జట్టు చివరకు 234 పరుగులకు ఆలౌటైంది. అభిషేక్ పొరెల్ (82), పులకిత్ నారంగ్ (41) ఆకట్టుకున్నారు. భారత్ ‘ఎ’ బౌలర్లలో అవేశ్ ఖాన్, అఖీబ్ ఖాన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. నేడు ఆటకు ఆఖరి రోజు కాగా... చేతిలో 4 వికెట్లు ఉన్న భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొని ఓవరాల్‌గా 333 పరుగుల ఆధిక్యంలో ఉంది. కుమార్ కుషాగ్రతో పాటు తనుశ్ కోటియాన్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
స్కోరు వివరాలు
భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 297;
భారత్ ‘సి’ తొలి ఇన్నింగ్స్: 234;
భారత్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్: ప్రథమ్ సింగ్ (సి) రుతురాజ్ గైక్వాడ్ (బి) గౌరవ్ యాదవ్ 11; మయాంగ్ అగర్వాల్ (బి) అన్షుల్ కంబోజ్ 34; తిలక్ వర్మ (సి) రుతురాజ్ గైక్వాడ్ (బి) అన్షుల్ కంబోజ్ 19; రియాన్ పరాగ్ (సి) రుతురాజ్ గైక్వాడ్ (బి) గౌరవ్ యాదవ్ 73; శాశ్వత్ రావత్ (బి) మానవ్ సుతార్ 53; కుమార్ కుషాగ్ర (నాటౌట్) 40; షమ్స్ ములానీ (సి) అన్షుల్ కంబోజ్ (బి) మానవ్ సుతార్ 8; తనుశ్ కోటియాన్ (నాటౌట్) 13; ఎక్స్‌ట్రాలు: 19; మొత్తం (64 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి) 270. వికెట్ల పతనం: 1–35, 2–73, 3–94, 4–199, 5–209, 6–234, బౌలింగ్: అన్షుల్ కంబోజ్ 16–3–52–2; గౌరవ్ యాదవ్ 14–0– 60–2;
విజయ్‌కుమార్ వైశాఖ్ 6–0–36–0; పులకిత్ నారంగ్ 8–1–30–0; మానవ్ సుతార్ 20–0–75–2.
Comments
Please login to add a commentAdd a comment