ఐపీఎల్‌లో గత కొన్ని సీజన్లగా తన ఆట తీరుతో విమర్శలు మూటగట్టుకుంటున్న రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ ఎట్టకేలకు బ్యాట్‌ను ఝులిపించాడు. ఐపీఎల్-2024లో భాగంగా జైపూర్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో పరాగ్ అదరగొట్టాడు. నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పరాగ్ తన అద్బుతమైన ఇన్నింగ్స్‌తో అందరని ఆకట్టుకున్నాడు.
కెప్టెన్ సంజూ శాంసన్‌తో కలిసి తన జట్టుకు భారీ స్కోర్‌ను అందించాడు. 29 బంతులు ఎదుర్కొన్న రియాన్.. ఒక ఫోర్, 3 సిక్స్‌లతో 43 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇది చూసిన నెటిజన్లు అన్న ఇది నీవేనా.. అస్సలు ఊహించలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా 2019లో ఐపీఎల్‌లో రాజస్తాన్ డెబ్యూ చేసిన రియాన్ పరాగ్.. ఇప్పటివరకు 55 మ్యాచులు ఆడాడు. వాటిల్లో 643 పరుగులు స్కోర్ చేశాడు. అందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో కెప్టెన్ సంజూ శాంసన్ (52 బంతుల్లో 82 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. శాంసన్‌తో పాటు రియాన్ పరాగ్ (43) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ రెండు వికెట్లు పడగొట్టగా.. రవి బిష్ణోయ్, మోహ్సిన్ ఖాన్ తలా వికెట్ పడగొట్టారు.
𝙋𝙖𝙧𝙖𝙜 𝙥𝙤𝙬𝙚𝙧 💪#RRvLSG #TATAIPL #IPLonJioCinema #IPL2024 #JioCinemaSports pic.twitter.com/lzqzCLqBfY
— JioCinema (@JioCinema) March 24, 2024
Comments
Please login to add a commentAdd a comment