Courtesy: IPL Twitter
రాజస్థాన్ రాయల్స్ ఆల్ రౌండర్ రియాన్ పరాగ్ ఆ జట్టుకే కాకుండా టీమిండియాకు కూడా అత్యత్తుమ ఫినిషర్‌గా మారుతాను అని తెలిపాడు. పరాగ్ 2018లో అండర్-19 కప్ గెలిచిన భారత్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక 2019 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం పరాగ్ చేశాడు. అదే విధంగా ఐపీఎల్-2022 మెగా వేలంలో రూ. 3.8 కోట్లకు మళ్లీ రాజస్తాన్ కొనుగోలు చేసింది. "నా గురుంచి నేను గొప్పగా చెప్పాలి అని అనుకోవడం లేదు. కానీ నేను రాజస్థాన్ రాయల్స్‌కే కాకుండా రాబోయే రోజుల్లో భారత్ కూడా అత్యత్తుమ ఫినిషర్‌గా ఉండగలనని అనుకుంటున్నాను.
నాకు బ్యాటింగ్, ఫీల్డింగ్ ,బౌలింగ్‌లో రాణించే సత్తా ఉంది. భారత్ తరపున నాకు ఆడే అవకాశం రావాలంటే మరింత రాణించాల్సిన అవసరం ఉంది. రాజస్థాన్ రాయల్స్ తరుపునే కాకుండా భారత్ తరుపునా అత్యత్తుమ ప్రదర్శన చేస్తానే నమ్మకం ఉంది" అని పేర్కొన్నాడు. కాగా ఇప్పటి వరకు 34 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన పరాగ్.. 364 పరుగులతో పాటు మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక పరాగ్‌కు కెప్టెన్‌గా అనుభవం కూడా ఉంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పరాగ్ అస్సాం జట్టుకు నాయకత్వం వహించాడు.
చదవండి: IPL 2022 RR Vs GT: హార్ధిక్ పాండ్యాకు ఏమైంది.. ? మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయాడు!
Comments
Please login to add a commentAdd a comment