iPhone 15 Series With USB Type-C To Offer With Apple-Certified Cables - Sakshi
Sakshi News home page

ఐఫోన్‌ 15 సిరీస్‌లో మార్పులు.. అదే జరిగితే యాపిల్‌కు తిరుగుండదు!

Published Tue, Mar 21 2023 8:21 PM | Last Updated on Wed, Mar 22 2023 9:07 AM

Iphone 15 Series With Usb Type-c To Offer With Apple-certified Cables - Sakshi

యాపిల్‌ ఐఫోన్‌ 15 సిరీస్‌ విడుదలకు ఇంకా కొన్ని నెలల సమయం ఉంది. అయినా యాపిల్‌ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ ఫీచర్లు, కలర్‌, డిజైన్‌ల గురించి ఊహాగానాలు వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా ఐఫోన్‌ యూఎస్‌బీఐ టైప్‌-సి (USB Type-C) కేబుల్‌ వినియోగాన్ని హైలెట్‌ చేసేలా ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. 

యూరోపియన్‌ యూనియన్‌ చట్టాల ప్రకారం..ఐఫోన్‌ సిరీస్‌లోని ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌, ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌లలో ఛార్జింగ్‌ టైప్‌-సి పోర్ట్‌ అమర్చాల్సి ఉంది. అయితే యాపిల్‌ సంస్థ ఐఫోన్‌ 15 మోడళ్లకు టైప్‌-సి పోర్ట్‌ను పరిమితం చేస్తూ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో ఎంఎఫ్‌ఐ (ఐఫోన్‌ కోసమే ప్రత్యేకంగా) సర్టిఫైడ్‌ కేబుల్స్‌ను వినియోగంలో తేనున్నట్లు సమాచారం. 

టీఎఫ్‌ ఇంటర్నేషనల్‌ సెక్యూరిటీ సంస్థ అనలిస్ట్‌  Ming-Chi Kuo రిపోర్ట్‌ విడుదల చేశారు. ఆ నివేదికలో ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో సర్టిఫైడ్‌ కేబుల్స్‌తో ఐఫోన్‌ 15 మోడల్స్‌ అన్నింటిలో యూఎస్‌బీ టైప్‌- సి పోర్ట్‌ ఉంటుందని సూచించారు. 


చదవండి👉 ఐఫోన్ కొనేవారికి హోలీ పండగ బంపరాఫర్‌!..మరీ ఇంత డిస్కౌంటా?


అదే జరిగితే యాపిల్‌కు తిరుగుండదు
ప్రస్తుతం ఐఫోన్‌ 14 మోడల్స్‌లో లైట్నింగ్‌ కనెక్టర్‌ (ఐఫోన్‌ ఛార్జర్‌) 20 డబ్ల్యూ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సౌకర్యం ఉంది. కానీ ఈ ఏడాది క్యూ1, క్యూ 2లలో యాపిల్‌ లైట్నింగ్‌ కనెక్టర్‌తో పాటు యూఎస్‌బీ-సీ ఛార్జర్‌తో 20 డబ్ల్యూ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ పెట్టుకునేలా డిజైన్‌ చేయాలనే డిమాండ్లు పెరిగినట్లు తెలిపారు. ఒకవేళ అదే జరిగితే యూఎస్‌బీ టైప్‌- సీ సెగ్మెంట్‌లో యాపిల్‌ మరింత స్ట్రాంగ్‌ అవ్వొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. క్యూ 4 నాటికి యూఎస్‌బీ టైప్‌ -సీ షిప్‌మెంట్‌ 120 శాతం వృద్దితో 70 మిలియన్ల యూనిట్స్‌కు చేరుకోవచ్చని అన్నారు.

ఛార్జర్‌ కొనాల్సిందే
యాపిల్‌ బాక్స్‌లోని ఐఫోన్‌తో ఛార్జింగ్ అడాప్టర్‌ను బండిల్‌ను అందించదు. కాబట్టి, ఐఫోన్ 15 యూనిట్లలో రాబోయే ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌ను సద్వినియోగం చేసుకోవడానికి వినియోగదారులు యాపిల్-సర్టిఫైడ్ యూఎస్‌బీ టైప్-సి కేబుల్ లేదా అడాప్టర్‌ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం, కంపెనీ 20డబ్ల్యూ యూఎస్‌బీ టైప్-సి అడాప్టర్, 30డబ్ల్యూ అడాప్టర్‌ను అందిస్తోంది.

చదవండి👉 ‘హార్ట్‌ ఎటాక్‌’ను గుర్తించే యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 8పై భారీ డిస్కౌంట్లు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement