రోడ్డుపై రాకెట్..!
ఈ బైక్‌ను చూస్తుంటే రయ్య్ ్రఅంటూ రోడ్డుపై దూసుకుపోవాలనిపిస్తోంది కదూ? దీని వేగం, ప్రత్యేకతలు చూస్తే బైక్ ప్రేమికులు మనసు పారేసుకోవడం ఖాయం. ఇటలీకి చెందిన ఎనర్జికా అనే సంస్థ రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ బైక్ పేరు ‘ఇగో’. 11.7 కిలోవాట్ల బ్యాటరీ, వంద కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఉండటం వల్ల ఇది రోడ్డుపై రాకెట్‌లా దూసుకుపోతుంది. క్లచ్, గేర్లు లేని ఈ బైక్ గరిష్ట వే గం గంటకు 240 కిలోమీటర్లు. సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని కేవలం మూడు సెకన్ల కంటే తక్కువ సమయంలోనే అందుకుంటుంది.
బ్యాటరీని పూర్తిస్థాయిలో చార్జింగ్ చేయడానికి మూడున్నర గంటల సమయం పడుతుంది. మాకు అంత సమయం లేదు.. ఇంకా తొందరగా చార్జింగ్ అయిపోవాలనుకుంటే ఫాస్ట్ చార్జర్ ఆప్షన్‌ను ఉపయోగిస్తే అరగంటలో 80 శాతం చార్జింగ్ అయిపోతుంది. అన్నీ బాగానే ఉన్నాయి కానీ.. ధర ఎంత ఉంటుందా అని ఆలోచిస్తున్నారా? బ్యాటరీ తేడాలను బట్టి రూ.15 లక్షల నుంచి రూ.17 లక్షల మధ్య ఉంటుంది. అది కూడా వచ్చే ఏడాదిలో మార్కెట్‌లోకి రానుంది.