హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రతిష్టాత్మక ఇండియా ఎనర్జీ వీక్–2024లో మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్), దాని అనుబంధ సంస్ధ డ్రిల్‌మెక్ తయారు చేసిన హెచ్‌హెచ్ 150 ఆటోమేటెడ్ హైడ్రాలిక్ వర్క్‌ఓవర్ రిగ్‌ను ప్రదర్శించింది.
అత్యంత అధునాతన రిగ్‌లను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయడం పట్ల కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ హర్షం వ్యక్తం చేశారు. ఓఎన్‌జీసీకి ఎంఈఐఎల్ 20 రిగ్‌లను అందిస్తోందని, దేశ ఇంధన రంగ ప్రయాణంలో శుభ పరిణామం అని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి తెలిపారు.
ప్రపంచ పటంలో చమురు, సహజ వాయు రంగంలో సముచిత స్థానంలో భారత్‌ను నిలబెట్టేందుకు అవసరమైన ఉత్పాదనలను తయారు చేస్తామని ఈ సందర్భంగా ఎంఈఐఎల్ ఎండీ పి.వి.కృష్ణారెడ్డి తెలిపారు. గోవాలో జరుగుతున్న ఇండియా ఎనర్జీ వీక్‌లో ఎంఈఐఎల్ అనుబంధ కంపెనీలైన మేఘా గ్యాస్, ఓలెక్ట్రా, ఈవీట్రాన్స్, ఐకామ్ తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment