
వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డిపై సొంతపార్టీ నాయకులే పెట్రోల్‌తో దాడికి యత్నించడం కలకలం రేపింది. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో పలువురు చేరడంతో ఆ పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డి వర్గీయులు హల్‌చల్ చేశారు. చేరికలను నిరసిస్తూ తాడిపర్తి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గణేష్ గౌడ్, తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు.
ఈ క్రమంలో గణేష్ గౌడ్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకోవడమే కాకుండా.. చేరికలపై మాట్లాడుతున్న ఎమ్మెల్యే మేఘారెడ్డిపై పెట్రోల్‌తో దాడికి ప్రయత్నించి నానా హంగామా సృష్టించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టారు. చిన్నారెడ్డి ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని మేఘారెడ్డి వర్గీయులు హెచ్చరించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డిపై పెట్రోల్‌తో దాడికి ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులు
కాంగ్రెస్ పార్టీలో చేరికలపై మాట్లాడుతున్న వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై పెట్రోల్‌తో దాడికి ప్రయత్నించిన తాడిపర్తి గ్రామానికి చెందిన చిన్నారెడ్డి వర్గీయుడు గణేష్ గౌడ్ అనుచరులు.
చిన్నారెడ్డి… pic.twitter.com/yTCuOrbKaf
— Telugu Scribe (@TeluguScribe) April 18, 2024
Comments
Please login to add a commentAdd a comment