సాక్షి, పెద్దమందడి: ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేసి కేసీఆర్‌ను మళ్లీ గెలిపిస్తే రాష్ట్రం నాశనం అవుతుందని వనపర్తి ఎమ్మెల్యే అభ్యర్థి చిన్నా రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని బలిజపల్లి, జంగమాయపల్లి, పామిరెడ్డిపల్లి, ముందరితండా, చీకర్‌చెట్టుతండా వీరాయపల్లి, చిన్నమందడి గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా దొడగుంటపల్లిలో ఆయన మాట్లాడుతూ సాగునీరు తెచ్చేందుకు దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హ యాంలోనే కాల్వలను తవ్వామని, అపట్లో రాజశేఖర్‌రెడ్డిని ఒప్పించి ఖిల్లాగఘనపురం, బుద్దారం, పెద్దమందడి మండలాల్లో 27 వేల ఎకరాల కు సాగునీరు అందించేందుకు కృషిచేశామన్నారు.
నీళ్లు తెచ్చింది నిరంజన్‌రెడ్డి కాదు.. చిన్నారెడ్డి అని గుర్తించుకోవాలన్నారు. అనంతరం మాసిరెడ్డి, వడ్డె సింగోటంతోపాటు యువకులు చిన్నారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు వేణుగోపాల్, రమేష్‌గౌడ్, నాయకులు వెంకటస్వామి, సత్యారెడ్డి, ఉసేనయ్య, సుధాకర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, నరసింహరెడ్డి, చెన్నారెడ్డి పాల్గొన్నారు.
వనపర్తి: మహాకూటమి అభ్యర్థి చిన్నారెడ్డి గురువారం నియోజకవర్గంలోని పెద్దమందడి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలను కలిసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. బలిజపల్లి, పామిరెడ్డిపల్లి, వీరాయపల్లి, పెద్దమందడి గ్రామాలతోపాటు తండాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో కూటమి నాయకులు తిరుపతయ్య, వెంకటయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
పెబ్బేరు: కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు ధనలక్ష్మి ఆధ్వర్యంలో మహాకూటమి నాయకులు పట్టణంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేద ప్రజలకు అన్ని రకాల అభివృద్ధి పనులు జరగడంతోపాటు న్యాయం జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో ఏఐసీసీ మహిళా ఉపాధ్యక్షురాలు రాణిరాంద్ర, పీసీసీ మహిళా ఉపాధ్యక్షురాలు మానస, సీపీఐ జిల్లా అధ్యక్షుడు చంద్రయ్య, శ్రీనివాస్‌గౌడ్, విజయవర్ధన్‌రెడ్డి, కృష్ణకుమార్‌రెడ్డి, రంజిత్, రాములు యాదవ్, అంజి, షకీల్, నిజాం, చిట్టిబాబు, సర్వేష్, రాములు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment