ఇంట్లో పులి.. వీధిలో పిల్లి అంటే ఇదేనా..!  | GVL Narasimha Rao Satires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

ఇంట్లో పులి.. వీధిలో పిల్లి అంటే ఇదేనా..! 

Published Mon, Jun 18 2018 10:05 AM | Last Updated on Mon, Jun 18 2018 10:23 AM

GVL Narasimha Rao Satires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నీతిఆయోగ్‌ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంతో యుద్ధ వైఖరి అనుసరించారంటూ టీడీపీ చేసిన ప్రచారంపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు ఎద్దేవా వేశారు. ‘నీతి ఆయోగ్‌ సమావేశం గురించి మీడియాలో టీడీపీ అసత్యాలు ప్రచారం చేసింది. సమావేశంలో ప్రతి ముఖ్యమంత్రి కోసం కేటాయించిన సమయం 7 నిమిషాలు. చంద్రబాబు 12 నిమిషాలు మాట్లాడారు. అయితే సీఎం ఘర్షణ విధానాన్ని అనుసరించలేదు. టీడీపీ తప్పుడు ప్రచారం పూర్తిగా ఈచిత్రాల ద‍్వార బహిర్గతం. ఇంట్లో పులి వీధిలో పిల్లి అంటే ఇదేనా..!’ అంటూ ప్రధాన మంత్రితో చంద్రబాబు నాయుడు నవ్వుతూ మాట్లాడుతున్న చిత్రాలను ట్వీట్‌ చేశారు.  

ప్యాకేజీతోనే ఎక్కువ నిధులని మీరే అన్నారు..
ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీతోనే ఎక్కువ నిధులు రాష్ట్రానికి వచ్చాయని చంద్రబాబే పత్రికల్లో రాయించారని, ఇప్పుడు ఆయన తీసుకున్న యూటర్న్‌లను ప్రజలు గమనిస్తున్నారని జీవీఎల్‌  పేర్కొన్నారు. ‘నీతి ఆయోగ్‌ సమావేశంలో చంద్రబాబు రాష్ట్ర సమస్యలను విస్తృతంగా ప్రస్తావించారని టీడీపీ నేతలు బాగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారు ప్రచారాలకు పరిమితమై ప్రజల అభివృద్ధికి పనిచేయడం లేదు. ప్రజా సంక్షేమానికి చొరవ తీసుకోవడం లేదు. కేంద్రం సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నా ఏమీ పట్టనట్టు ఉన్నారు. స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ ఏర్పాటు చేయమంటే ఇంతవరకు ఎందుకు చేయలేదు?. పోలవరానికి రావాలిసిన నిధులన్నీ త్వరలోనే రాబోతున్నాయి. నాబార్డు ద్వారా వెంటనే విడుదల అవుతాయని మాకు సమాచారం ఉంది. వెనకబడిన జిల్లాలకు రూ. 300 కోట్ల చొప్పున కేంద్రం ఇచ్చింది. రాష్ట్రానికి రావాల్సిన ప్రతి ఒక్క రూపాయి కేంద్రం ఇస్తూనే ఉంటుంది’ అని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement