Political Satires On Pawan Kalyan Kathipudi Varahi Public Meeting - Sakshi
Sakshi News home page

పవన్‌పై కక్ష గట్టారట! ఏవండోయ్... ఇది విన్నారా?

Published Wed, Jun 14 2023 7:54 PM | Last Updated on Wed, Jun 14 2023 8:43 PM

Political Satires on Pawan Kalyan kathipudi varahi Public Meeting - Sakshi

నాపై కక్ష గట్టారు. అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకునే యత్నం చేశారు.. 

ప్చ్‌.. వారాహి యాత్రలో భాగంగా బుధవారం తూర్పు గోదావరి జిల్లా కత్తిపూడి బహిరంగ సభలో పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలకు పొలిటికల్‌గా పడుతున్న కొన్ని కౌంటర్లు..

నాకు చె గువేరా స్ఫూర్తి: గుండెల్లో మాత్రం చంద్రబాబే!

నాపై కక్ష గట్టారు: అవును మరి నమ్ముకున్న వాళ్లను ముంచుతున్నావ్‌ కదా! అందుకేనేమో 

నన్ను అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు: ఓటేసేది జనాలు.. పార్టీలు కావు

ఈసారి కచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతా: ప్రజలు మనస్ఫూర్తిగా ఓట్లేసి  గెల్పించినప్పుడు చూద్దాం లే!

నేను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఎవరు ఆపుతారో చూస్తా: విజిటర్స్‌ పాస్‌ తీసుకొనా?

నా కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు: అవునా.. నిజమా.. మరి ప్యాకేజీ కోసం వచ్చావా?

పార్టీని నడపడానికే నేను సినిమాలు చేస్తున్నా: ముసుగులో బాబుతో దోస్తీ.. బోనస్‌గా ప్యాకేజీ!

సీఎం జగన్‌కు నా ఛాలెంజ్‌: ఆ అర్హత నిజంగానే ఉందా?

దేశంలో అత్యధిక పారితోషకం అందుకునే హీరోని నేను: పొలిటికల్‌ ప్యాకేజీ కూడానా?

నేను విడిగా వస్తానో.. ఉమ్మడిగా వస్తానో నిర్ణయించలేదు!: ఆ నిర్ణయం నీ చేతుల్లో ఉంటేనే కదా!

సీఎం పదవి ఇస్తే స్వీకరిస్తా!: అప్పల్రాజూ.. మరి చంద్రబాబు ఊరుకుంటాడంటావా?

అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు ఎన్ని వ్యూహాలైన రచిస్తా: స్క్రిప్ట్‌ మాత్రం బాబుగారిదే

ఏపీ నుంచే జనసేన రాజకీయం: అయిపాయే!

జనసేనకు మైనార్టీలు ఓటేయ్యరు: మీ సంగతి తెలిసిన ఏ వర్గమూ ఆదరించదు

సహృదయంగా మాట్లాడాను: లోగుట్టు నారావారికెరుక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement