kathipudi
-
పీకే తప్పుడు లెక్కలు.. హద్దులు దాటిన అబద్దాలు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో జనసేన పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనలు సత్యదూరంగా ఉన్నాయి. ప్రజల్లో సానుభూతి పొందేందుకు పూర్తిగా అబద్దాలను, అసత్యాలను వల్లె వేసినట్టు కనిపిస్తోందని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శిస్తున్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఏ మాట మాట్లాడినా.. దానికి ఆధారాలుంటాయి, గతంలో చేసిన ప్రకటనల రెఫరెన్స్ ఉంటుంది. ఆ విషయాలను మరిచిపోయిన పవన్ కల్యాణ్.. యధాలాపంగా తనకు తోచిన విషయాన్ని నమ్మించేలా చెప్పడానికి ప్రయత్నించి ప్రజలకు దొరికిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు తాను ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం కాలేనని, దానికి సరిపడా సమీకరణాలే లేవని చెప్పాడు. ఆ విషయాన్ని అభిమానులు అర్థం చేసుకోవాలని అభ్యర్థించాడు కూడా. అదేంటో కానీ ఇప్పుడు కొత్తగా "నేనే సీయం" అన్న నినాదం మళ్లీ పవన్‌కళ్యాణ్‌కు గుర్తుకొచ్చింది. అంటే మొన్న చెప్పింది ప్రజలు కచ్చితంగా మరిచిపోయి ఉంటారన్నది పవన్ కల్యాణ్ నమ్మకంలా కనిపించింది. ఇప్పటివరకు సొంతంగా పోటీ చేస్తానన్న దానిపై తనకే నమ్మకం లేని పవన్ కల్యాణ్.. ఎలాగోలా పోటీ అయితే చేస్తానని, అసెంబ్లీకి కూడా వెళ్తానని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో గత ఎన్నికల గురించి ప్రస్తావించారు. తాను ఓడిపోయానని నిజాయతీగా ఒప్పుకున్నా బాగుండేది కానీ, దీని వెనక ఏదో కుట్ర జరిగిందని సరికొత్తగా ట్విస్టు ఇచ్చే ప్రయత్నం చేసి నవ్వులపాలయ్యారు. పవన్ కళ్యాణ్ : ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టకుండా నన్ను ఎవరు అడ్డుకుంటారో చూస్తా. గత ఎన్నికల సమయంలో అసెంబ్లీలోకి అడుగుపెట్టకూడదని, నాపై కక్షగట్టి.. నేను పోటీ చేసిన గాజువాక, భీమవరంలో ఓడించారు. ఆ రెండు చోట్లా ఉన్న ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలు, వాటికి సంబంధించి భారత ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్లో ఉంచిన లెక్కలు ఒకసారి పరిశీలించి నిజమేంటో చూద్దాం. ముందుగా భీమవరం విషయానికి వస్తే.. ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం భీమవరంలో 246424 మంది ఓటర్లు 2019 నాటికి ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 77.94% పోలింగ్ జరిగింది. అంటే 192061 మంది ఓటేశారు. ఎన్నికల సంఘం ప్రకారం ఇక్కడ ఇంకా 50403 మంది అసలు ఓటే వేయలేదు. అంటే పవన్‌కళ్యాణ్ చెప్పిన ఎక్కువ ఓట్లు లెక్క పూర్తిగా అబద్దమే కదా. ఇక గాజువాక విషయానికి వస్తే.. ఇక్కడ ఏకంగా ఓటేయని వారి సంఖ్య 110727. గాజువాకలో మొత్తం ఓటర్లు 310011. ఇక్కడ 64.28% పోలింగ్ జరిగింది. అంటే 1,99,284 మంది మాత్రమే ఓటేశారు. ఎన్నికల సంఘం ప్రకారం ఇక్కడ ఇంకా 110727 మంది ఓటేయలేదు. అంటే ఇక్కడకూడా పవన్‌కళ్యాణ్ చెప్పింది అసత్యమే అని ఈసీ ఇచ్చిన డాటా నిరూపిస్తోంది. సానుభూతి కోసం చేసే ఇలాంటి ప్రకటనల వల్ల క్రెడిబిలిటీ పెరగకపోగా.. అసలుకే మోసం వచ్చే ఆస్కారం ఉందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఇలాంటి ప్రయత్నం చేసి ఇబ్బంది పడ్డారని, ఇప్పటికీ అదే ధోరణీ అనుసరిస్తే.. మరింత దెబ్బ తింటారంటున్నారు. ::: పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ ఇదీ చదవండి: జనసేనానివి సొల్లు కబుర్లు -
పవన్‌పై కక్ష గట్టారట.. హ..హ..హ!
ప్చ్.. వారాహి యాత్రలో భాగంగా బుధవారం తూర్పు గోదావరి జిల్లా కత్తిపూడి బహిరంగ సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు పొలిటికల్‌గా పడుతున్న కొన్ని కౌంటర్లు.. నాకు చె గువేరా స్ఫూర్తి: గుండెల్లో మాత్రం చంద్రబాబే! నాపై కక్ష గట్టారు: అవును మరి నమ్ముకున్న వాళ్లను ముంచుతున్నావ్ కదా! అందుకేనేమో నన్ను అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు: ఓటేసేది జనాలు.. పార్టీలు కావు ఈసారి కచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతా: ప్రజలు మనస్ఫూర్తిగా ఓట్లేసి గెల్పించినప్పుడు చూద్దాం లే! నేను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఎవరు ఆపుతారో చూస్తా: విజిటర్స్ పాస్ తీసుకొనా? నా కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు: అవునా.. నిజమా.. మరి ప్యాకేజీ కోసం వచ్చావా? పార్టీని నడపడానికే నేను సినిమాలు చేస్తున్నా: ముసుగులో బాబుతో దోస్తీ.. బోనస్‌గా ప్యాకేజీ! సీఎం జగన్‌కు నా ఛాలెంజ్: ఆ అర్హత నిజంగానే ఉందా? దేశంలో అత్యధిక పారితోషకం అందుకునే హీరోని నేను: పొలిటికల్ ప్యాకేజీ కూడానా? నేను విడిగా వస్తానో.. ఉమ్మడిగా వస్తానో నిర్ణయించలేదు!: ఆ నిర్ణయం నీ చేతుల్లో ఉంటేనే కదా! సీఎం పదవి ఇస్తే స్వీకరిస్తా!: అప్పల్రాజూ.. మరి చంద్రబాబు ఊరుకుంటాడంటావా? అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు ఎన్ని వ్యూహాలైన రచిస్తా: స్క్రిప్ట్ మాత్రం బాబుగారిదే ఏపీ నుంచే జనసేన రాజకీయం: అయిపాయే! జనసేనకు మైనార్టీలు ఓటేయ్యరు: మీ సంగతి తెలిసిన ఏ వర్గమూ ఆదరించదు సహృదయంగా మాట్లాడాను: లోగుట్టు నారావారికెరుక -
చంద్రబాబుకు ముద్రగడ లేఖ
కాకినాడ: మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 31వ తేదీన కత్తిపూడిలో ‘చలో కత్తిపూడి సమావేశం’ నిర్వహించడానికి తలపెట్టిన సంగతి తెలిసిందే. అయితే సభకు తమ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ విశాల్ గున్ని పేర్కొన్న నేపథ్యంలో ముద్రగడ సభను తాత్కాలికంగా వాయిదా వేస్తూనే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. ఇందులో చంద్రబాబుకు అనేక ప్రశ్నలను సంధించారు ముద్రగడ. ‘గత మూడేళ్లుగా తమ జాతి కోసం జరిగిన ఉద్యమం గురించి ఈనెల 31వ తేదీన కత్తిపూడిలో చిన్న సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి సమాయత్తమయ్యాం. మరి ఆ కలయిక గురించి మీరు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో అర్థం కావడం లేదు. అన్ని పార్టీల పెద్ద నాయకులు నిత్యం రోడ్డుకు అడ్డంగా ఎన్నో సభలు పెట్టుకుంటున్నారు. మీరు కూడా ధర్మపోరాట దీక్షల వంకతో విజయవాడలాంటి అతి పెద్దపట్టణం నాలుగు రోడ్ల జంక్షన్లో ట్రాఫిక్ మళ్లించి రోడ్డుకు అడ్డంగా కుర్చీలు వేసి ఉపన్యాసాలు చెప్పారు. అలాగే తొందరలో మీరు ఢిల్లీలో కూడా దీక్ష చేస్తానని చెబుతున్నారే. మీరు బస్సు యాత్ర పేరుతో ఏ జిల్లాకైనా బయలుదేరినప్పుడు ట్రాఫిక్‌ను గంటల తరబడి నిలిపివేస్తున్నారే. మీ అందరికీ ఒక రాజ్యాంగం.. మాకు మరొక రాజ్యాంగమా ముఖ్యమంత్రి గారూ’ అని ముద్రగడ ప్రశ్నించారు. ఇక్కడ చదవండి: ‘అనుమతి తీసుకోకుంటే కఠిన చర్యలు’ -
‘అనుమతి తీసుకోకుంటే కఠిన చర్యలు’
-
‘ఛలో కత్తిపూడి సభకు అనుమతి తీసుకోలేదు’
సాక్షి, కిర్లంపూడి : పోలీసు శాఖ అనుమతులు లేకుండా బహిరంగ సభలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 31న ముద్రగడ పద్మనాభం చేపట్టనున్న ‘ఛలో కత్తిపూడి’ సభకు తమ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదని పేర్కొన్నారు. జిల్లాలో జరిగిన వైఎస్ జగన్, పవన్ కల్యాణ్ యాత్రలతో పాటు రాజమండ్రి బీసీ సభ ఇలా అన్నీ కూడా పోలీసుల అనుమతితోనే జరిగాయని తెలిపారు. ఛలో కత్తిపూడి సభకు అనుమతి కోరితే పరిశీలిస్తామని.. అనుమతి లేని సభలకు వెళ్లి ప్రజలు ఇబ్బందులకు గురి కావొద్దని సూచించారు. ఛలో కత్తిపూడి సభకు ముద్రగడ పిలుపు ఇవ్వడంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమయింది. ఇందులో భాగంగా ముద్రగడ స్వగ్రామమైన కిర్లంపూడిలో గత రెండు రోజుల నుండి పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తును పటిష్టం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు పోలీసు అధికారులు కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ సోమవారం కిర్లంపూడిలో ఆకస్మికంగా పర్యటించారు. -
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు: 20 మందికి గాయాలు
శంఖవరం: తూర్పుగోదావరి జిల్లాలోని శంఖవరం మండలం కత్తిపూడి వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పుష్కర యాత్రికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.