
మద్రాస్ అసెంబ్లీలో ఏదో చర్చ నడుస్తోంది. జస్టిస్ పార్టీకి చెందిన పానుగంటి రామరాయనింగార్ మాట్లాడుతున్నారు. ఆయన గతంలో తీసుకున్న వైఖరికి పూర్తి విరుద్ధంగా చెబుతున్నారు. ఇది కట్టమంచి రామలింగారెడ్డి గ్రహించారు. సాహితీవేత్త, రాజనీతిజ్ఞుడిగా పేరొందిన కట్టమంచి అప్పటికి జస్టిస్ పార్టీ వీడి స్వతంత్ర సభ్యుడిగా ఉన్నారు.
‘ఆర్యా, గతంలో రామరాయనింగార్ గారు ఈ అంశానికి అనుకూలంగా మాట్లాడారు, ఇప్పుడు ప్రతికూలంగా మాట్లాడుతున్నారు. గతంలో ఆయన వైఖరిని తెలియజేసే ఉత్తరాలు నా దగ్గర ఉన్నాయి’ అని తన జేబులో చేయి పెట్టబోయారు కట్టమంచి.
‘ప్రేమికులిద్దరూ ప్రేమించుకున్నప్పుడు ఏవో లేఖలు రాసుకుంటారు. ఏదైనా కారణం వల్ల ఆ బంధం విడిపోతే, ఎవరి లేఖలు వాళ్లకు ఇచ్చుకోవడం, పాతవాటిని స్మరించకుండా ఉండటం పెద్ద మనుషుల మర్యాద’ అని పెద్ద మనిషి అన్నమాటను నొక్కారు రామరాయనింగార్. ఇంక దాని మీద కొనసాగించకుండా కూర్చుండిపోయారు కట్టమంచి, పెద్దమనిషిలా!
(మీకు ఇలాంటి మరమరాలు తెలిస్తే మాకు రాయండి.)
Comments
Please login to add a commentAdd a comment