సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌కు ఓటేస్తే దుష్ట పాలన వస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే కష్టాలు తప్పవని, కాంగ్రెస్‌కు ఓటేసి కర్ణాటక ప్రజలు బాధపడుతున్నారన్నారు. ఎల్‌బీనగర్‌లో ఆదివారం ఆయన బీఆర్‌ఎస్ బూత్ కమిటీల విస్తృతస్థాయి సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, కర్ణాటక రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేశాం అని మొత్తుకుంటున్నారన్నారు. కేసీఆర్ పాలన చూసి ఓటేయాలని కేటీఆర్ కోరారు.
కాంగ్రెస్‌లో అందరూ సీఎంలేనంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు. జగ్గారెడ్డి కూడా సీఎం అంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌లో 6,7 మంది సీఎం కాండిడెట్లున్నారు పోటీలో లేకపోయినా జానారెడ్డి సీఎం పదవిపై ఆశ పడుతున్నారు. జగ్గారెడ్డి, రేవంత్‌రెడ్డి, భట్టి, ఉత్తమ్ అందరూ సీఎంలే. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేసి తప్పు చేయొద్దు. 2014కు ముందు నీళ్లు, కరెంట్ లేక ఇబ్బందులు పడ్డారు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
చదవండి: తెలంగాణలో జెండా పీకేసిన టీడీపీ..
Comments
Please login to add a commentAdd a comment