Minister Ambati Rambabu Satirical Comments On Chandrababu In Twitter, Tweet Viral - Sakshi
Sakshi News home page

గొంతు పిసికి చంపేశాడు! అతన్ని విలన్ అంటారా? హీరో అంటారా ?’

Published Fri, Oct 14 2022 5:19 PM | Last Updated on Fri, Oct 14 2022 6:22 PM

Minister Ambati Rambabu Satires On Chandrababu In Twitter - Sakshi

సాక్షి, అమరావతి: ట్విట్టర్‌ వేదికగా చంద్రబాబుపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘కాళ్ళు పట్టుకుని అడుక్కున్నాడు. తన మాట వినమని! వినల! గొంతు పిసికి చంపేశాడు!! అతన్ని విలన్ అంటారా? హీరో అంటారా ?’’ అంటూ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు ఎపిసోడ్‌లో చంద్రబాబు పాత్రను ఉటంకిస్తూ అంబటి రాంబాబు సెటరికల్‌గా కామెంట్లు చేశారు.
చదవండి: ‘టీడీపీ, ఎల్లో మీడియా చెప్పినట్టు మేం ఆడాలా?’

కాగా,  అన్ స్ఠాపబుల్‌గా చంద్రబాబు అబద్దాలు చాలా బాగా చెప్పారని మంత్రి ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు. ఆమె శుక్రవారం ఉదయం.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ, ఎన్టీఆర్‌ మరణానికి కారణమైన చంద్రబాబు, ఆయన్ని ఆరాధ్య దైవం అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబునాయుడు సీఎం కావడానికి కారణం కుప్పం ప్రజలు, కానీ కుప్పానికి ఏమి చెయ్యలేదని రోజా అన్నారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement