
సాక్షి, అమరావతి: టీడీపీపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలను సంధించారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ‘‘మీరు చెప్పినట్టుగానే లైట్లు ఆపేసిన ఇళ్లు లెక్కవేస్తే 2019లో వచ్చిన ఆ 23 కూడా 2024లో రావటగా!. రాష్ట్రాన్ని ఆర్పేసిన బాబు కోసం మేమెందుకు మా ఇళ్ళల్లో లైట్లను ఆపాలంటున్నారట తెలుగు తమ్ముళ్లు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇంకొంతమంది నేతలు టపాసులు కాల్చారట. వాళ్ళ ఆనందమే వేరులే. మొత్తానికి టీడీపీ ఆరిపోయే దీపం అని మీరే సింబాలిక్‌గా చెప్పడం ఎదైతో ఉందో.. నభూతో నభవిష్యత్’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
మీరు చెప్పినట్టుగానే లైట్లు ఆపేసిన ఇళ్లు లెక్కవేస్తే 2019లో వచ్చిన ఆ 23 కూడా 2024లో రావటగా! రాష్ట్రాన్ని ఆర్పేసిన బాబు కోసం మేమెందుకు మా ఇళ్ళల్లో లైట్లను ఆపాలంటున్నారట తెలుగు తమ్ముళ్లు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇంకొంతమంది నేతలు టపాసులు కాల్చారట! వాళ్ళ ఆనందమే వేరులే! మొత్తానికి టీడీపీ…
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 8, 2023
కాగా, చంద్రబాబు అరెస్టుపై ప్రజల్లో ఏమాత్రం స్పందన కనిపించడంలేదు. తమ నాయకుడిని అరెస్టు చేసిన తర్వాత ప్రజల నుంచి సానుభూతి వెల్లువెత్తుతోందని ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నా, అది ఎక్కడా మచ్చుకైనా కనిపించడంలేదు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో టీడీపీ పలు కార్యక్రమాలు ప్రకటించి, వాటిలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిస్తున్నా, స్పందన ఉండటంలేదు. ప్రజలే కాదు.. ఆ పార్టీ శ్రేణుల్లోనూ స్పందన కరవైంది. శనివారం రాత్రి కూడా కాంతితో క్రాంతి అంటూ టీడీపీ చేపట్టిన కార్యక్రమమూ విఫలమైంది.
చదవండి: బ్రెయిన్ డెడ్ పార్టీకి సానుభూతి వైద్యం
Comments
Please login to add a commentAdd a comment