శృంగేరీ మఠంలో రాహుల్
న్యూఢిల్లీ/సాక్షి,బెంగళూరు: దక్షిణ డోక్లాం చేరుకోవడానికి చైనా కొత్త మార్గం తెరుస్తోందన్న వార్తల నేపథ్యంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యంగ్యా స్త్రాలు సంధించారు. ఈ పరిణామాన్ని ప్రధాని ఎలా ఎదుర్కొంటారు?కౌగిలింత దౌత్యం తోనా? లేక రక్షణ మంత్రిని బాధ్యురాలిని చేస్తారా? అంటూ ట్వీట్ చేశారు.
‘డోక్లాంలో మళ్లీ చైనా జోరు పెరిగింది. ఈసారి మోదీ ఎలా స్పందిస్తారు? 1.కౌగిలింత దౌత్యం 2.రక్షణ మంత్రిని బాధ్యురాల్ని చేయడం 3. బహిరంగ విమర్శలు 4. పైవన్నీ’ అని పేర్కొన్నారు. గతంలో నానమ్మ ఇందిరా గాంధీని ఆదరించినట్లుగానే తననూ ఆశీర్వదించాలని రాహుల్ గాంధీ ప్రజలను కోరారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన చిక్కమగళూరులో పర్యటించారు.
Comments
Please login to add a commentAdd a comment