new road
-
తిరుపతిలో కొత్త టెక్నాలజీతో రోడ్డు
-
లవ్లీనాకు వెల్కం : శరవేగంగా పనులు
టోక్యో ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్‌లో సెమీస్‌లోకి దూసుకొచ్చిన భారత బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ స్వర్ణం వేటలో నిరాశే ఎదురైంది. బుధవారం జరిగిన పోటీలో టర్కీకి చెందిన బుసేనాజ్ సుర్మెనెలీ ఓటమి పాలైంది. అయినా కాంస్య పతకాన్ని గెల్చుకున్నలవ్లీనాపై ‘లవ్లీ’ అంటూ అభినందనల వెల్లువ కురుస్తోంది. మరోవైపు లవ్లీనా స్వగ్రామం అస్సాం రాష్ట్రంలోని బారోముఖియా ఆమెకు వెల్కం చెప్పేందుకు ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో గోలాఘాట్ జిల్లాలోని ఆమె నివాసానికి వెళ్లే రహదారి నిర్మాణ పనులు ఊపందు కున్నాయి. ఇటీవలి భారీ వర్షాలకు ఇక్కడ రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో సుమారు 3.5 కిలోమీటర్ల నిర్మితమవుతున్న ఈ రోడ్డు ఒలింపిక్స్ పతకంతో మురిపించిన లవ్లీనాకు వెల్కం చెప్పేందుకు సిద్ధమవుతోంది. దీంతో ఆ గ్రామంలో సందడి నెలకొంది. మరోవైపు సెమీ ఫైనల్ నేపథ్యంలో అసాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌ను వీక్షించేందుకు అసెంబ్లీని వాయిదా వేయాలని నిర్ణయించింది. చారిత్రాత్మక స్వర్ణ పతకం సాధించాలని కోరుకుంటూ తమ అభిమాన బాక్సర్‌ని ప్రత్యక్షంగా చూడటానికి అనుమతించాలని డిప్యూటీ స్పీకర్ నుమాల్ మోమిన్ స్పీకర్ బిశ్వజిత్ డైమరీని అభ్యర్థించినట్లు సంబంధిత అధికారి తెలిపారు. బౌట్ ముగిసేంతవరకు సభలోని సభ్యులందరూ, అసెంబ్లీ సిబ్బంది దీన్ని వీక్షించారు. కాగా అస్సాం నుంచి ఒలింపిక్ పతకం సాధించిన తొలి క్రీడాకారిణి, అలాగే ఒలింపిక్స్‌లో పాల్గొన్న రాష్ట్రం నుండి మొదటి మహిళా అథ్లెట్ కూడా లవ్లీనే కావడం విశేషం. కాగా టోక్యో ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్ సెమీస్‌లో లవ్లీనా బొర్గోహైన్‌కు నిరాశ ఎదురైంది. టర్కీకి చెందిన బుసేనాజ్ చేతిలో ఓటమి పాలైంది. దీంతో లవ్లీనా కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
కౌగిలింతా? రాద్ధాంతమా?
న్యూఢిల్లీ/సాక్షి,బెంగళూరు: దక్షిణ డోక్లాం చేరుకోవడానికి చైనా కొత్త మార్గం తెరుస్తోందన్న వార్తల నేపథ్యంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యంగ్యా స్త్రాలు సంధించారు. ఈ పరిణామాన్ని ప్రధాని ఎలా ఎదుర్కొంటారు?కౌగిలింత దౌత్యం తోనా? లేక రక్షణ మంత్రిని బాధ్యురాలిని చేస్తారా? అంటూ ట్వీట్ చేశారు. ‘డోక్లాంలో మళ్లీ చైనా జోరు పెరిగింది. ఈసారి మోదీ ఎలా స్పందిస్తారు? 1.కౌగిలింత దౌత్యం 2.రక్షణ మంత్రిని బాధ్యురాల్ని చేయడం 3. బహిరంగ విమర్శలు 4. పైవన్నీ’ అని పేర్కొన్నారు. గతంలో నానమ్మ ఇందిరా గాంధీని ఆదరించినట్లుగానే తననూ ఆశీర్వదించాలని రాహుల్ గాంధీ ప్రజలను కోరారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన చిక్కమగళూరులో పర్యటించారు. -
కృష్ణ కృష్ణా.. ఇవేం రోడ్లు!
ఏడాది తిరక్కుండానే రూపు కోల్పోయిన పుష్కర రోడ్లు ► సీఎం చెప్పారంటూ హడావుడిగా గుంతలు పూడుస్తున్న అధికారులు ► తొలి దఫాగా రూ.30 కోట్లతో పనులు ► నాణ్యతా లోపాలను పట్టించుకోని ప్రభుత్వం ► కాంట్రాక్టర్లకు వరంగా మారుతున్న వైనం సాక్షి, హైదరాబాద్: గత సంవత్సరం కృష్ణా పుష్కరాల సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా మాగనూరు మండలంలో కృష్ణా నది వరకు కొత్త రహదారి నిర్మించారు. సాధార ణంగా ఒక రహదారి కనిష్టంగా ఐదేళ్లు మన్నాలి.. అది నిబంధన కూడా.. కానీ, తొమ్మిది నెలల్లో ఆ రోడ్డు రూపు రేఖల్లేకుండా పోయింది. కృష్ణా పుష్కరాలు దగ్గరపడటంతో హడావుడిగా నిర్మించటంతో అక్కడి రోడ్లన్నీ ఇలాగే మారాయి. జూన్ నుంచి రోడ్లపై గుంత కనిపిస్తే సంబంధిత అధికారులను సస్పెండ్ చేస్తానని సీఎం చంద్రశేఖరరావు హెచ్చరిం చటంతో ఇప్పుడు అధికారులు గుంతలను పూడ్చే యజ్ఞం ప్రారంభించారు. ఇందుకు తొలి దశగా రూ.30 కోట్లు ఖర్చు చేయబోతు న్నారు. హడావుడి పనులు.. ప్రమాణాలకు పాతర.. అనతికాలంలోనే ప్రత్యక్షమయ్యే గుంతలు.. వాటికి మరమ్మతుల పేరిట మళ్లీ కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నారు. ఖజా నాకు తూట్లు పొడుస్తున్నారు. కాంట్రాక్టర్లకు పనులు కల్పించటమే ధ్యేయమన్నట్లుగా ఈ కథ సుఖంగా సాగుతోంది. రోడ్లు పాడవ డానికి కారణాలేంటో కూడా సమీక్షిం చకుండా.. గుంతలు పూడుస్తున్నారు. కాంట్రాక్టర్లకు పండుగ చేయబోతున్నారు. ప్రమాణాలే లేవు... దాదాపు 15 ఏళ్లక్రితం రోడ్ల నిర్వహణ యావత్తూ సంబంధిత శాఖ సిబ్బందే పర్య వేక్షించేవారు. ఇందుకోసం ప్రత్యేకంగా గ్యాంగ్‌మెన్, వర్క్ ఇన్స్పెక్టర్లు ఉండేవారు. రైలు పట్టాలను నిరంతరం పరిశీలిస్తూ చిన్న లోపం కనిపించినా సరిదిద్దేలా ఉపయోగపడే గ్యాంగ్‌మెన్ వ్యవస్థ రోడ్ల విషయంలోనూ ఉండేది. ఒక్కో గ్యాంగ్‌మెన్ 8 కిలోమీటర్ల మేర, ఒక్కో వర్క్ ఇన్స్పెక్టర్ 30 కిలోమీటర్ల మేర పర్యవేక్షించేవారు. వారికి జీతాల రూపంలో అయ్యే వ్యయం తడిసిమోపెడవు తోందన్న ఉద్దేశంతో నాటి ప్రభుత్వం వారి నియామకాలు ఆపేసి రోడ్ల నిర్వహణను పూర్తిగా కాంట్రాక్టర్లకు అప్పగించింది. కానీ కాంట్రాక్టర్లు, కొన్ని చోట్ల అధికారులు కుమ్మౖక్కై బిల్లులు విడుదల చేసి చేతులు దులుపు కోవటం మినహా వాటి నిర్వహణ గాలికొదిలేశారు. పైపై పనులతో తూతూ మంత్రంగా కానివ్వటం ప్రారంభించారు. ప్రస్తుతం రోడ్లు నిర్మించిన తర్వాత మూడేళ్లపాటు సంబంధిత కాంట్రాక్టరే వాటిని నిర్వహించాల్సి ఉంది. కానీ నాలుగో సంవత్స రం నుంచే అవి గుంతలు పడుతున్నాయి. ప్రధాన రహదారులు పదేళ్లపాటు మన్నాల్సి ఉంటుంది. కనీసం ఐదేళ్లు పాడుకావద్దు. కానీ మూడేళ్ల తర్వాత దెబ్బతింటున్నాయి. కానీ ఎవరిపై చర్యలు తీసుకోవటం లేదు. ఇప్పటి వరకు ఒక్క కాంట్రాక్టర్‌ను కూడా ఈ పేరుతో బ్లాక్ లిస్టులో పెట్టి పెనాల్టీ విధించిన దాఖలాలు లేవు. చిన్న రోడ్లపై పూర్తి నిర్లక్ష్యం ప్రధాన రహదారులు ఓ మోస్తరుగా ఉంటుండగా చిన్నరోడ్లు మాత్రం దారుణంగా మారు తున్నాయి. వేసిన కొంతకాలానికే పాడవుతున్నాయి. దీంతో ప్రాథమిక దశలో వాటిని మర మ్మతు చేయకుండా గుంతలు పెద్దవయ్యేవరకు ఎదురు చూసి ఆ తర్వాత మరమ్మతులు సాధ్యం కావంటూ కొత్త లేయర్లను నిర్మిస్తున్నారు. దీంతో అతి తక్కువ ఖర్చుతో అయ్యే పనికి మూడు నాలుగు రెట్లు ఎక్కువ ఖర్చయ్యేలా చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయాలను పూర్తిగా విస్మరిస్తోంది. ఇక ప్రస్తుతం మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరుసల రోడ్లను నిర్మిస్తున్నారు. వీటి విషయంలో కూడా ప్రమాణాలు పాటించట్లేదు. కొన్ని రోడ్ల విష యంలో ప్రమాణాలు పాటించకపోవటాన్ని ఇటీవల రోడ్లు భవనాల శాఖ నాణ్యతా విభాగం కూడా తప్పుపట్టినట్లు తెలిసింది. నిర్మాణానికి వాడే మిశ్రమాన్ని రూపొందించేందుకు పగ్ మిల్ యంత్రాలను వాడాలి. మిశ్రమాన్ని పరిచి సమం చేసేందుకు పేవర్ యంత్రాలు విని యోగించాల్సి ఉంది. కానీ ట్రాక్టర్లకు ఇనుప కమ్మీలు బిగించి పని కానిచ్చేస్తున్నారు. దీంతో రోడ్డు వాలు పట్టు తప్పి వానలు పడ్డప్పుడు నీళ్లు నిలిచి రోడ్డు పాడయ్యేందుకు అవకాశం కలుగుతోంది. ఇలాంటి లోపాలను నియంత్రించాల్సిన ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా పైపై పూతలు పూయాలని ఆదేశించడంతో తిరిగి కాంట్రాక్టర్లకే వరంగా మారుతోంది. -
కుంగిపోయిన కొత్త రోడ్డు!
► ‘ సాక్షి’ ముందే హెచ్చరించినా మేలుకోని అధికారులు ► రోడ్డు పనులు పూర్తికాక ముందే ఈ పరిస్థితి ► ఆర్ అండ్ బీ ఆదేశాలు బేఖాతర్ ► గతంలో ఇరిగేషన్ పనుల వల్లే దెబ్బతిన్న నాగాయలంక రోడ్డు అవనిగడ్డ : కొద్దిరోజుల క్రితం వేసిన నాగాయలంక రోడ్డు వేకనూరు వద్ద కుంగిపోయింది. ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదకర పరిస్థితిలో ఉందని ‘సాక్షి’ ముందే హెచ్చరించినా అధికారుల్లో చలనం లేదు. దీంతో రూ.1.67 కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త రోడ్డు పది రోజులకే కుంగిపోయింది. అధికారులు స్పందించి ఉంటే.. ఆధునికీకరణ పనుల్లో భాగంగా గతంలో అవనిగడ్డ–కోడూరు, అవనిగడ్డ–నాగాయలంక మధ్య చేపట్టిన రిటైనింగ్ వాల్ పనుల వల్ల రెండు మండలాలకు వెళ్లే ప్రధాన రహదారులు పలుచోట్ల కుంగిపోయాయి. అధికారులు పర్యవేక్షణ లేకుండా కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా పనులు చేయడం వల్ల ఈ పరిస్థితి నెలకొందని గతంలో ‘సాక్షి’లో పలు ప్రత్యేక కథనాలు వచ్చిన విషయం విదితమే. రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం అధికారుల పర్యవేక్షణ లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వడం వల్ల రోడ్డు కుంగిపోయే ప్రమాదం ఉందని ‘సాక్షి’ ముందే హెచ్చరించినా అధికారులు పట్టించుకోలేదు. వేకనూరు–గుడివాకవారిపాలెం మధ్య ఇటీవల చేపట్టిన రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల వల్ల ప్రధాన రహదారికి పొంచిఉన్న ప్రమాదంపై ఈ నెల 4వ తేదీ ‘సాక్షి’లో ‘అదే నిర్లక్ష్యం’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. అధికారులు తగు చర్యలు తీసుకోకపోతే ఈ ప్రాంతంలో రహదారి కుంగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అయినా అధికారులు స్పందించక పోవడంతో పది రోజుల క్రితం రూ.1.97 కోట్లతో వేసిన తారురోడ్డు పెచ్చులుపెచ్చులుగా కుంగిపోయింది. ఈ రహదారి పనులు ఇంకా పూర్తికాక ముందే రోడ్డు కుంగిపోవడం కొసమెరుపు. ఎస్ఈ ఆదేశాలు బేఖాతర్ గతంలో ఈ ప్రాంతంలో చేపట్టిన ఆధునికీకరణ పనుల వల్ల కోట్లాది రూపాయలతో నిర్మించిన ప్రధాన రహదారులు దెబ్బతిన్న విషయం ఇటీవలే రోడ్డు పనులను పరిశీలించడానికి వచ్చిన ఆర్అండ్బీ ఎస్ఈ శేషుకుమార్ దృష్టికి ‘సాక్షి’ తీసుకెళ్లింది. దీంతో స్పందించిన ఎస్ఈ రోడ్డు పక్కన పనులు చేసేటప్పుడు తప్పనిసరిగా ఆర్అండ్బీ అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. అయినా సంబంధిత అ«ధికారులు స్పందించకపోవడం వల్లే ఈ రహదారి కుంగిపోయింది. పనులు పూర్తయినా.. ఆధునికీకరణ పనుల్లో భాగంగా అవనిగడ్డ – నాగాయలంక మధ్య చేపట్టిన రిటైనింగ్ వాల్ పనులు పూర్తయినా ఖాళీలో ఇసుక నింపకపోవడం వల్ల రహదారి దెబ్బతింటోంది. ఏడాది క్రితం నిర్మించిన రిటైనింగ్ వాల్ పనులకు ఇసుకను తోలకపోవడంతో రోడ్లు దెబ్బతింటున్నా ఉన్నతాధికారులు చోద్యం చూడటం పట్ల ఈ ప్రాంత వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారి దెబ్బతినకుండా ఆధునికీకరణ పనులను పర్యవేక్షణ చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. -
ప్రజల చేతికే...ప్రగతి చ్రక్రం
మీ కాలనీలో రోడ్డు బాగా లేదా..? కొత్త రోడ్డు వేయాల్సిందిగా జీహెచ్ఎంసీ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి కాళ్లు అరుగుతున్నాయా.. ? నో ప్రాబ్లమ్. మీ బస్తీలో పిల్లల పుట్టిన రోజులు, చిన్న చిన్న ఫంక్షన్లు నిర్వహించుకునేందుకు కమ్యూనిటీ హాలు ఉంటే బాగుండేదని అనుకుంటున్నారా ..? ఇకపై చింతించాల్సిన పని లేదు. మీ పరిసరాల్లో ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉంది. దానికో ప్రహరీ నిర్మిస్తే పిల్లలకు ఆట స్థలంగానో.. లేదా పార్కుగానో అభివృద్ధి చేయవచ్చుననుకుంటున్నారా..? మీరు చేయాలనుకుంటున్న పనికి సహకారం అందుతుంది. సాక్షి, సిటీబ్యూరో: కాలనీలు.. బస్తీల ప్రజలు తమకు ఏఏ సదుపాయాలు అవసరమని భావిస్తున్నారో వాటిని స్వయంగా వారే చేపట్టేందుకు జీహెచ్ఎంసీ అవకాశం కల్పించబోతోంది. బస్తీ సంఘాలు.. కాలనీ అసోసియేషన్లు.. లేదా పదిమంది బృందంగా ఏర్పడి తమ అవసరాల కోసం తామే పనులు చేసుకుంటామంటే జీెహ చ్ఎంసీ అవకాశం కల్పించనుంది. ప్రజలకు ఉపయోగపడే పనులను వారి భాగస్వామ్యంతోనే చేయించాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. దాదాపు రూ.10 నుంచి రూ.20 లక్షలకు మించని పనులను ఇలా ప్రజలకే ఇచ్చేందుకు సంబంధిత అధికారులు యోచిస్తున్నారు. తద్వారా ప్రజలకు అవసరమైన సదుపాయాలు సకాలంలో సమకూరడమే కాకుండా.. పనులు సత్వరం పూర్తవుతాయని భావిస్తున్నారు. అంతేకాదు.. తమ కోసం పనులు చేసుకుంటారు కాబట్టి నాణ్యతలోనూ ప్రజలు రాజీ పడబోరని భావిస్తున్నారు. వివిధ పనులకు సంబంధించి తగిన ప్రతిపాదనలతో ముందుకు వచ్చే వారికి అంచనా వ్యయం, ఇతరత్రా అంశాలను లెక్కించి, జీహెచ్ఎంసీ అధికారులు 80 శాతం మేర నిధులు అందజేస్తారు. మిగతా 20 శాతం నిధులను పనులు పూర్తయ్యాక, క్వాలిటీ కంట్రోల్ పరీక్షల అనంతరం చెల్లిస్తారు. సాంకేతిక పదాల జోలికి పోకుండా, వీలైనంత మేరకు ప్రజలకు అర్థమయ్యే భాషలోనే అంచనాలు రూపొందిస్తారు. ఇలా ఏటా దాదాపు రూ.500 కోట్ల మేర పనులు చేయవచ్చునని అంచనా వేస్తున్నారు. తొలుత ప్రయోగాత్మకంగా 20-30 కాలనీల్లో రూ.10 కోట్ల మేర ఇలాంటి పనులను ప్రజలకు అప్పగించాలని భావిస్తున్నారు. త్వరలో జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదం పొందాక ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ విలేకరులకు తెలిపారు. రెసిడె న్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు(ఆర్డబ్ల్యూఏలు) తాము చేయదలచుకున్న పనుల వివరాలతో ఆన్లైన్ ద్వారా జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేయవచ్చు. అటు నిధుల సద్వినియోగం.. ఇటు అభివృద్ధి జీహెచ్ఎంసీకి దాదాపు రూ.4 వేల కోట్ల బడ్జెట్ ఉంది. కానీ అందులో సగం నిధులు కూడా ఖర్చు కావడం లేదు. సాధారణంగా ఎక్కువ చోట్ల నిధుల లేమి సమస్య ఎదురవుతుంది. జీహెచ్ఎంసీలో పరిస్థితి దీనికి భిన్నం. అందుకు కారణాలనేకం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జీహ చ్ఎంసీ ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు చేస్తున్న పనులను అలా కొనసాగిస్తూనే.. తక్కువ మొత్తాల్లో పూర్తయ్యే పనులను స్థానికులకు, భారీ మొత్తాల్లో చేపట్టాల్సిన వాటిని పెద్ద కాంట్రాక్టు సంస్థలకు అప్పగించే యోచనలో ఉన్నారు. తద్వారా నిధులు వినియోగమై, ప్రజలకు అవసరమైన సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. కాలనీలు, బస్తీల్లో ఉండే రిటైర్డు ఇంజినీర్ల వంటి వారి సహకారంతో పనులు నాణ్యతగా జరుగుతాయనేది అధికారుల అభిప్రాయం. ‘మన ఊరు-మన ప్రణాళిక’ తరహాలో నగరంలోని వివిధ డివిజన్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ఈ విధానం ఉపకరిస్తుందని అంచనా వేస్తున్నారు. అభివృద్ధి పనుల్లో స్థానికులకు భాగస్వామ్యం కల్పించినట్లూ అవుతుందని భావిస్తున్నారు. పెద్ద పెద్ద పనులకు (రూ.100- రూ.200 కోట్ల వరకు) అంతర్జాతీయ సంస్థలు పాల్గొనేలా టెండర్లు పిలవాలని భావిస్తున్నారు. -
రెడ్డిపాలెంలో నూతన రోడ్డు నిర్మాణం
వేగవంతంగా అభివృద్ధి పనులు గుంటూరు రూరల్, న్యూస్‌లైన్: ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకొని వీలైనంత వేగవంతంగా అభివృద్ధి పనులు నిర్వహిస్తామని ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి చెప్పారు. రెడ్డిపాలెంలో వీజీటీఎం ఉడా ఆధ్వర్యంలో ఫెస్-4లో భాగంగా నూతన రోడ్డు నిర్మాణానికి ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు. 2 కిలోమీటర్ల రోడ్డుకు రూ.6.50 కోట్లతో పనులు చేపట్టినట్టు తెలిపారు. 3 నెలలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ రోడ్డు నిర్మాణం వల్ల సత్తెనపల్లి నుంచి గుంటూరు, చిలకలూరిపేట నుంచి గుంటూరు మీదుగా విజయవాడకు తక్కువ సమయంలో ప్రయాణం చేయవచ్చన్నారు. గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు అనేక ఇబ్బందులకు గురౌతున్నారని, మిని బైపాస్ రోడ్డు పనులను వీలైన్నంత త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. స్థలం అందజేసిన రెడ్డిపాలెం రైతులకు టిడిఆర్ బాండ్లను కూడా 85 శాతం వరకు అందజేశామని తెలిపారు. మిగిలిన వారు సంబంధిత దస్తావే జులు అందజేస్తే వారికి కూడా టిడిఆర్ బాండ్లు అందజేస్తామని తెలిపారు. అభివృద్ధికి పనుల్లో నాసిరకం మెటీరియల్వాడితే చర్యలు తీసుకోవడంతో పాటు కాంట్రాక్ట్ రద్దు చేస్తామని హెచ్చరించారు. రైతుల నుంచి సేకరించిన పొలాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఉడా సిబ్బంది, గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు.