కృష్ణ కృష్ణా.. ఇవేం రోడ్లు! | quality defects in krishna Pushkar roads | Sakshi
Sakshi News home page

కృష్ణ కృష్ణా.. ఇవేం రోడ్లు!

Published Thu, May 11 2017 1:44 AM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM

కృష్ణ కృష్ణా.. ఇవేం రోడ్లు! - Sakshi

కృష్ణ కృష్ణా.. ఇవేం రోడ్లు!

ఏడాది తిరక్కుండానే రూపు కోల్పోయిన పుష్కర రోడ్లు
► సీఎం చెప్పారంటూ హడావుడిగా గుంతలు పూడుస్తున్న అధికారులు
► తొలి దఫాగా రూ.30 కోట్లతో పనులు
► నాణ్యతా లోపాలను పట్టించుకోని ప్రభుత్వం
► కాంట్రాక్టర్లకు వరంగా మారుతున్న వైనం


సాక్షి, హైదరాబాద్‌: గత సంవత్సరం కృష్ణా పుష్కరాల సందర్భంగా మహబూబ్‌నగర్‌ జిల్లా మాగనూరు మండలంలో కృష్ణా నది వరకు కొత్త రహదారి నిర్మించారు. సాధార ణంగా ఒక రహదారి కనిష్టంగా ఐదేళ్లు మన్నాలి.. అది నిబంధన కూడా.. కానీ, తొమ్మిది నెలల్లో ఆ రోడ్డు రూపు రేఖల్లేకుండా పోయింది. కృష్ణా పుష్కరాలు దగ్గరపడటంతో హడావుడిగా నిర్మించటంతో అక్కడి రోడ్లన్నీ ఇలాగే మారాయి. జూన్‌ నుంచి రోడ్లపై గుంత కనిపిస్తే సంబంధిత అధికారులను సస్పెండ్‌ చేస్తానని సీఎం చంద్రశేఖరరావు హెచ్చరిం చటంతో ఇప్పుడు అధికారులు గుంతలను పూడ్చే యజ్ఞం ప్రారంభించారు.

ఇందుకు తొలి దశగా రూ.30 కోట్లు ఖర్చు చేయబోతు న్నారు. హడావుడి పనులు.. ప్రమాణాలకు పాతర.. అనతికాలంలోనే ప్రత్యక్షమయ్యే గుంతలు.. వాటికి మరమ్మతుల పేరిట మళ్లీ కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నారు. ఖజా నాకు తూట్లు పొడుస్తున్నారు. కాంట్రాక్టర్లకు పనులు కల్పించటమే ధ్యేయమన్నట్లుగా ఈ కథ సుఖంగా సాగుతోంది. రోడ్లు పాడవ డానికి కారణాలేంటో కూడా సమీక్షిం చకుండా.. గుంతలు పూడుస్తున్నారు. కాంట్రాక్టర్లకు పండుగ చేయబోతున్నారు.

ప్రమాణాలే లేవు...
దాదాపు 15 ఏళ్లక్రితం రోడ్ల నిర్వహణ యావత్తూ సంబంధిత శాఖ సిబ్బందే పర్య వేక్షించేవారు. ఇందుకోసం ప్రత్యేకంగా గ్యాంగ్‌మెన్, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు ఉండేవారు. రైలు పట్టాలను నిరంతరం పరిశీలిస్తూ చిన్న లోపం కనిపించినా సరిదిద్దేలా ఉపయోగపడే గ్యాంగ్‌మెన్‌ వ్యవస్థ రోడ్ల విషయంలోనూ ఉండేది. ఒక్కో గ్యాంగ్‌మెన్‌ 8 కిలోమీటర్ల మేర, ఒక్కో వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ 30 కిలోమీటర్ల మేర పర్యవేక్షించేవారు. వారికి జీతాల రూపంలో అయ్యే వ్యయం తడిసిమోపెడవు తోందన్న ఉద్దేశంతో నాటి ప్రభుత్వం వారి నియామకాలు ఆపేసి రోడ్ల నిర్వహణను పూర్తిగా కాంట్రాక్టర్లకు అప్పగించింది.

కానీ కాంట్రాక్టర్లు, కొన్ని చోట్ల అధికారులు కుమ్మౖక్కై బిల్లులు విడుదల చేసి చేతులు దులుపు కోవటం మినహా వాటి నిర్వహణ గాలికొదిలేశారు. పైపై పనులతో తూతూ మంత్రంగా కానివ్వటం ప్రారంభించారు.  ప్రస్తుతం రోడ్లు నిర్మించిన తర్వాత మూడేళ్లపాటు సంబంధిత కాంట్రాక్టరే వాటిని నిర్వహించాల్సి ఉంది. కానీ నాలుగో సంవత్స రం నుంచే అవి గుంతలు పడుతున్నాయి. ప్రధాన రహదారులు పదేళ్లపాటు మన్నాల్సి ఉంటుంది. కనీసం ఐదేళ్లు పాడుకావద్దు. కానీ మూడేళ్ల తర్వాత దెబ్బతింటున్నాయి. కానీ ఎవరిపై చర్యలు తీసుకోవటం లేదు. ఇప్పటి వరకు ఒక్క కాంట్రాక్టర్‌ను కూడా ఈ పేరుతో బ్లాక్‌ లిస్టులో పెట్టి పెనాల్టీ విధించిన దాఖలాలు లేవు.

చిన్న రోడ్లపై పూర్తి నిర్లక్ష్యం
ప్రధాన రహదారులు ఓ మోస్తరుగా ఉంటుండగా చిన్నరోడ్లు మాత్రం దారుణంగా మారు తున్నాయి. వేసిన కొంతకాలానికే పాడవుతున్నాయి. దీంతో ప్రాథమిక దశలో వాటిని మర మ్మతు చేయకుండా గుంతలు పెద్దవయ్యేవరకు ఎదురు చూసి ఆ తర్వాత మరమ్మతులు సాధ్యం కావంటూ కొత్త లేయర్లను నిర్మిస్తున్నారు. దీంతో అతి తక్కువ ఖర్చుతో అయ్యే పనికి మూడు నాలుగు రెట్లు ఎక్కువ ఖర్చయ్యేలా చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయాలను పూర్తిగా విస్మరిస్తోంది. ఇక ప్రస్తుతం మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరుసల రోడ్లను నిర్మిస్తున్నారు.

వీటి విషయంలో కూడా ప్రమాణాలు పాటించట్లేదు. కొన్ని రోడ్ల విష యంలో ప్రమాణాలు పాటించకపోవటాన్ని ఇటీవల రోడ్లు భవనాల శాఖ నాణ్యతా విభాగం కూడా తప్పుపట్టినట్లు తెలిసింది. నిర్మాణానికి వాడే మిశ్రమాన్ని రూపొందించేందుకు పగ్‌ మిల్‌ యంత్రాలను వాడాలి. మిశ్రమాన్ని పరిచి సమం చేసేందుకు పేవర్‌ యంత్రాలు విని యోగించాల్సి ఉంది. కానీ ట్రాక్టర్లకు ఇనుప కమ్మీలు బిగించి పని కానిచ్చేస్తున్నారు. దీంతో రోడ్డు వాలు పట్టు తప్పి వానలు పడ్డప్పుడు నీళ్లు నిలిచి రోడ్డు పాడయ్యేందుకు అవకాశం కలుగుతోంది. ఇలాంటి లోపాలను నియంత్రించాల్సిన ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా పైపై పూతలు పూయాలని ఆదేశించడంతో తిరిగి కాంట్రాక్టర్లకే వరంగా మారుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement