సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుకు మాటలెక్కువ, చేతలు తక్కువని మరోసారి చాటుకున్నారంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎక్స్ వేదిగా సీఎం చంద్రబాబు తీరును ఎండగట్టారు. ఏ ప్రభుత్వానికైనా రోడ్ల మరమ్మత్తులు అన్నది ఓ నిరంతర కార్యక్రమం.. దాని ప్రచారానికి, ఆర్భాటాలకి ప్రభుత్వ ధనం వృధా చేయడం చంద్రబాబు నైజం అంటూ మండిపడ్డారు.
‘‘రాష్ట్రానికే తలమానికంగా ఉన్న వైజాగ్ స్టీల్ గురించి మాత్రం ముఖ్యమంత్రి నోరు మెదపడు. ఉత్తరాంధ్ర వాసుల ఆశలపై నీళ్లు జల్లేలా కార్మికులను, సంఘాలను చంద్రబాబు తప్పుబడుతున్నారు. మీ తుప్పు బట్టిన ఆలోచనలకి ఉచిత గ్యాస్ లబ్ధిదారుల్లో అరకోటి మందికి ఎగనామం పెట్టడం తెలుసు. మరి వైజాగ్‌ను అభివృద్ధి చెయ్యాలన్న ఆలోచన ఎక్కడ చంద్రబాబూ?’’ అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
చంద్రబాబుకు మాటలెక్కువ, చేతల తక్కువని మరోసారి చాటుకున్నారు..
ఏ ప్రభుత్వానికైనా రోడ్ల మరమ్మత్తులు అన్నది ఓ నిరంతర కార్యక్రమం/ప్రక్రియ. దాని ప్రచారానికి, ఆర్భాటాలకి ప్రభుత్వ ధనం వృధా చేయడం చంద్రబాబు నైజం. రాష్ట్రానికే తలమానికంగా ఉన్న వైజాగ్ స్టీల్ గురించి మాత్రం ముఖ్యమంత్రి నోరు…— Vijayasai Reddy V (@VSReddy_MP) November 2, 2024
Comments
Please login to add a commentAdd a comment