సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ నోబెల్ బహుమతికి అర్హులే.. మరి ఏ కేటగిరీలో దక్కొచ్చునని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. కోవిడ్ వ్యాక్సిన్‌ను కనుగొన్నందుకు మెడిసిన్ విభాగంలో ఇవ్వాలా..? నోట్ల రద్దు, స్విస్ బ్యాంకుల్లో నల్లధనం తీసుకొచ్చినందుకు ఆర్థికశాస్త్రంలో ఇవ్వాలా..? రష్యా–ఉక్రె యిన్ యుద్ధాన్ని ఆరు గంటలు ఆపినందుకు శాంతి విభాగంలో ఇవ్వాలా..? రాడార్ థియరీకి ఫిజిక్స్‌లో ఇవ్వాలా? అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
అంతకుముందు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తన ప్రసంగంలో కోవిడ్ వ్యాక్సిన్‌ను మొట్టమొదట ప్రధాని మోదీ కను గొన్నారని చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ ‘సైన్స్/మెడిసిన్‌లో నోబెల్ బహుమతిని ప్రధానికి ఇవ్వాలని డిమాండ్ చేద్దామని’.. ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. ‘కేంద్ర కేబినెట్‌లో అందరూ తెలివిమంతులేనని.. ముఖ్యంగా కిషన్ రెడ్డి’.. అంటూ వ్యాఖ్యానించారు. ఆస్కార్ కాకపోయినా భాస్కర్ అవార్డు ఇవ్వాల్సిందే అంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి మరో వెటకారపు ట్వీట్ చేశారాయన.
Modi Ji deserves Nobel prize but in which category?
— KTR (@KTRTRS) October 17, 2022
❇️ Nobel for Medicine - discovering Covid Vaccine
❇️ Nobel for Economics - Demonetisation & Swiss Black Money Returns
❇️ Nobel for Peace - Stopping the Russia-Ukraine war for 6 hours
❇️ Nobel for Physics - Radar Theory
To all those BJP folks who feel that Vish Guru deserves more than a Nobel👇
— KTR (@KTRTRS) October 17, 2022
I would also like to nominate Modi Ji of 2013 for his amazing histrionics & theatrical skills in criticising the then Union Govt on Rupee devaluation
ఆస్కార్ కాకపోయినా భాస్కర్ అవార్డు ఇవ్వాల్సిందే 👍 pic.twitter.com/QceFay8eVS
ఇదీ చదవండి: తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారు!
Comments
Please login to add a commentAdd a comment