సల్మాన్ కొత్త సినిమాపై పేలుతున్న జోకులు! | Satires On Salman Khan New Movie Race 3 | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ ఖాన్ కొత్త సినిమాపై సెటైర్లు

Published Wed, May 16 2018 8:01 PM | Last Updated on Wed, May 16 2018 8:48 PM

Satires On Salman Khan New Movie Race 3 - Sakshi

ముంబై : బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ కొత్త సినిమా రేస్‌3 ట్రైలర్‌ మంగళవారం విడుదలై మంచి ఆదరణ పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ట్రైలర్‌పై సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. సైన్స్‌ను ఎగతాళి చేయడానికే ఈ సినిమా తీశారని కొందరు, థమ్సప్‌ యాడ్‌ కోసం ఓ సినిమానే చేశారని మరికొందరు సినిమాపై జోకులు పేల్చుతున్నారు.

సల్మాన్‌ను బెయిల్‌పై విడుదల చేసిన న్యాయమూర్తి ఈ సినిమా చూస్తే కచ్చితంగా సల్మాన్‌ ఖాన్‌ను ఆయనతో పాటు బాబీ డియోల్‌ను కూడా ఐదు సంవత్సరాలు జైలులో పెడతారని ఓ నెటిజన్‌ వ్యంగ్యంగా స్పందించాడు. ఇలా నెటిజన్లు తమకు నచ్చిన రీతిలో రేస్‌3 ట్రైలర్‌పై స్పందిస్తూనే ఉన్నారు.

రెమో డిసౌజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సల్మాన్‌తో పాటు అనిల్‌ కపూర్‌, బాబీ డియోల్‌, జాక్వలిన్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా జూన్‌ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement