అల్లు అర్జున్‌ ఇంటిపై దాడి.. స్పందించిన కిషన్‌రెడ్డి | Kishan Reddy Responds On Attack Of Allu Arjun House | Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్‌ ఇంటిపై దాడి.. స్పందించిన కిషన్‌రెడ్డి

Published Sun, Dec 22 2024 9:11 PM | Last Updated on Sun, Dec 22 2024 9:17 PM

Kishan Reddy Responds On Attack Of Allu Arjun House

ఢిల్లీ : అల్లు అర్జున్‌ ఇంటిపై పలువురు దాడి చేసిన ఘటనకు సంబంధించి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. ఇది రాష్ట్రంలోని శాంతి భద్రతలను దిగ్భ్రాంతికి గురి చేసే ఘటన ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో అనడానికి ఇదొక ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. 

పౌరులకు రక్షణ కల్పించడంలో పరిపాలన అసమర్థతను ఇలాంటి సంఘటనలు ప్రతిబింబిస్తాయన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కళాకారులను, సినీ పరిశ్రమను టార్గెట్‌ చేయడం ప్రమాదకరమైన ఆనవాయితీగా మారిందని మండిపడ్డారు.  ఈ  ఆందోళన కాంగ్రెస్‌కు మద్దతుగానా?, లేక స్పాన్సర్డ్‌గానా అని ప్రశ్నించారు కిషన్‌రెడ్డి. 

 

స్టాప్‌ చీప్‌ పాలిటిక్స్‌ ఆన్‌ అల్లు అర్జున్‌’.. సోషల్‌ మీడియాలో వైరల్‌

అల్లు అర్జున్‌ ఇంటిపై రాళ్ల దాడి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement