
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అవగాహన లేకుండా మాట్లాడి ప్రతిష్ట దెబ్బతీస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి రాకముందు చాలా అంశాలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేసిన రేవంత్.. అధికారంలోకి వచ్చాక సీబీఐ డిమాండ్ అనే మాటే ఎత్తడం లేదన్నారు. అధికారంలోకి రాగానే ఆయన వైఖరి మారిందన్నారు కిషన్ రెడ్డి. అప్పుడు సీబీఐ దర్యాప్తు అంటూ హోరిత్తించారు.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు.
‘బీజేపీ నేతలు, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పనిచేసే సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. సినిమా నటులు, జడ్జీలు, మీడియా ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. సీబీఐ దర్యాప్తు చేస్తే మేం నిగ్గు తేలుస్తాం. మూసీ ప్రక్షాళనకు మేం ఎక్కడ అడ్డుకుంటున్నాం. మూసీ ప్రక్షాళన కు మేం వ్యతిరేకం కాదురేవంత్ మెట్రో నిర్మాణం చేస్తే మేం ఎందుకు అడ్డుకుంటాం. లేనిపోని ఆరోపణలు చేసి దిగజారి రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం వద్ద మార్కులు వూయించుకోవడానికి కేంద్ర మంత్రులను, మోదీని తిడుతున్నారు. రీజినల్ రింగ్ రోడ్డు ను తెలంగాణకు అదనంగా తెచ్చింది మేమే. రాజకీయాలకు అతీతంగా కృష్ణా జలాల తరలింపును అడ్డుకోవాలి’ అని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment