బీఆర్‌ఎస్ గురివింద గింజ తరహాలో వ్యవహరిస్తోంది
కాంగ్రెస్‌తో కలిసి పనిచేసింది వారే: కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ‘గురివింద గింజ తరహాలో.. బీఆర్‌ఎస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరును చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలిచిన వారిని కాంగ్రెస్‌లోకి.. చేతి గుర్తుపై గెలిచిన వారిని గులాబీ పార్టీలోకి పంపించుకుని.. మంత్రి పదవులు తీసుకున్నప్పుడు ఎవరు ఎవరితో కలిసినట్లో కేటీఆర్ చెప్పగలరా?’ అని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ప్ర శ్నించారు. ఎక్స్ వేదికగా కేటీఆర్ పోస్ట్‌పై గురువా రం ఢిల్లీలో కిషన్‌రెడ్డి స్పందిస్తూ... ‘కేటీఆర్ మిడిమి డి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌తో కలిసి పనిచేసింది వారు. ప్రభుత్వంలో భాగంగా ఉన్నది వారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నది వారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ తమ పార్టీలో చేర్చుకుంటోంది.
ఇప్పుడు బుర ద జల్లడం కోసం మాపైన ఆరోపణలు చేస్తున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలను పట్టించు కోవాల్సిన అవసరం లేదు’ అని వ్యా ఖ్యానించారు. పదేళ్ల పాటు బీఆర్‌ఎస్ అనుసరించిన మోసపూరిత విధానాలనే.. ఇవాళ కాంగ్రెస్ కాపీ కొట్టి ఏడాదిగా అనుసరిస్తున్న మాట వాస్తవం కాదా? కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ మొద లైన బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణా లు, కేసుల విషయంలో పురోగతి లేకపోవడమే ఎవ రితో ఎవరు కలిసున్నారని చెబుతోంది’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ ఒక సిద్ధాంతం ఆధా రంగా ఎదిగిన పార్టీ అని.. జాతీయవాదం, అంత్యో దయ వంటి నినాదాలతో పనిచేసే పార్టీ తమదని అన్నా రు. కుటుంబపాలన, అవినీతి వంటివి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీ సిద్ధాంతాలని.. అందుకే ఎవరికి ఎవరు దోస్తులనేది తెలంగాణ సమాజానికి తెలిసిపోయిందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment