సాక్షి, ఢిల్లీ: దేశంలో ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కేంద్రంలోకి బీజేపీ అధికారంలోకి వచ్చాకే 21 భాషలకు స్థానం దక్కిందన్నారు. అలాగే, భాషలు.. మన సంస్కృతి, వారసత్వాన్ని, మన జ్ఞాన సంపదకు నిలయం అని చెప్పుకొచ్చారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తాజాగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘భిన్న సంస్కృతులు, భిన్న భాషల వైవిధ్యత గల దేశం భారత్. ప్రపంచవ్యాప్తంగా ఇంత వైవిధ్యత ఉన్న దేశం మరొకటి లేదు. 121 భాషలు, మన దేశంలో ఉన్నాయి. మన రాజ్యాంగంలో 14 అధికార భాషలుండేవి. మోదీ ప్రభుత్వం వచ్చాకా 21 భాషలకు స్థానం దక్కింది. భాషలు మన సంస్కృతి, వారసత్వాన్ని, మన జ్ఞాన సంపదకు నిలయాలు. ఎన్డీయే ప్రభుత్వం, వాజ్‌పేయి గారి నేతృత్వంలో ప్రాంతీయ భాషలకు సరైన ప్రాధాన్యత ఇచ్చారు. భాష మన సంస్కృతికి ఆత్మ వంటిదని వాజ్‌పేయి చెప్పేవారు.
జ్ఞానాన్ని ప్రసరింపజేసేందుకు 1835లో మెకాలే ద్వారా భారత శాస్త్రీయ భాషల ప్రాధాన్యం తగ్గించే ప్రయత్నం జరిగింది. ఇంగ్లీష్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. స్వాతంత్ర్యానంతరం.. 1956లో భాష ఆధారిత రాష్ట్రాల పునర్నిర్మాణం జరిగినపుడు.. దేశానికి సహకార సమాఖ్య, పాలనాపరమైన అంశాల కోసం భాష కీలకమైన అంశంగా మారింది. పాలనాపరమైన సౌలభ్యం కోసం మూడు భాషల ఫార్ములాను రూపొందించారు. ఈ ఫార్ములా వినియోగంలో ప్రజలు సంతృప్తిగా లేని కారణంగా మార్పులు తీసుకురావాలనే డిమాండ్ పెరిగింది. దీనికి అనుగుణంగా ప్రధాని మోదీ 2020లో NEP-2020 నూతన జాతీయ విద్యావిధానం ద్వారా కనీసం రెండు ప్రాంతీయ భాషలను విద్యార్థులు నేర్చుకునేలా ప్రోత్సాహాన్ని అందించారు’ అని కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment