YSRCP Appointed New District President and Regional Coordinator - Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల జాబితా ఇదే..

Published Thu, Nov 24 2022 7:45 AM | Last Updated on Thu, Nov 24 2022 2:59 PM

YSRCP appointed New District presidents and Regional Coordinators - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులను కేంద్ర కార్యాలయం ప్రకటించింది. 

వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల కో–ఆర్డినేటర్‌గా చెవిరెడ్డి 
డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పార్టీ అనుబంధ విభాగాల కో ఆర్డినేటర్‌గా నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ప్రకటించింది. పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్, ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డికి సహాయకారిగా చెవిరెడ్డి వ్యవహరిస్తారని తెలిపింది.  

సీఎం జగన్‌కు కృతజ్ఞతలు: చెవిరెడ్డి
సీఎం వైఎస్‌ జగన్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. పార్టీలోని 23 అనుబంధ విభాగాల రాష్ట్ర కో ఆర్డినేటర్‌గా అత్యంత కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి, ప్రతి అనుబంధ విభాగాన్ని మరింత పటిష్ట పరిచేందుకు రేయింబవళ్లు నిర్విరామంగా పని చేస్తానని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్లు జాబితా
►శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి జిల్లాల కోఆర్డినేటర్‌గా బొత్స సత్యనారాయణ


►విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల కోఆర్డినేటర్‌గా వైవీ సుబ్బారెడ్డి


►కాకినాడ, తూగో, కోనసీమ, పగో, ఏలూరు జిల్లాల కోఆర్డినేటర్లుగా పిల్లి సుభాష్‌, మిథున్‌రెడ్డి


►కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల కోఆర్డినేటర్లుగా మర్రి రాజశేఖర్‌, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి

►పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల కోఆర్డినేటర్లుగా బీద మస్తాన్‌రావు, భూమన కరుణాకర్‌రెడ్డి


►నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల కోఆర్డినేటర్లుగా బాలినేని శ్రీనివాస్‌రెడ్డి


►అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాల కోఆర్డినేటర్‌గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి


►కర్నూలు, నంద్యాల జిల్లాల కోఆర్డినేటర్లుగా ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి

జిల్లా అధ్యక్షుల జాబితా
►శ్రీకాకుళం - ధర్మాన కృష్ణదాస్‌
►విజయనగరం - మజ్జి శ్రీనివాసరావు
►పార్వతీపురం మన్యం - పరీక్షిత్‌ రాజు
►అల్లూరి సీతారామరాజు - కోటగుళ్ల భాగ్యలక్ష్మి
►విశాఖపట్నం - పంచకర్ల రమేష్‌
►అనకాపల్లి - కరణం ధర్మశ్రీ
►కాకినాడ - కురసాల కన్నబాబు
►కోనసీమ - పొన్నాడ వెంటక సతీష్‌ కుమార్‌
►తూర్పుగోదావరి - జక్కంపూడి రాజా
►పశ్చిమగోదావరి - చెరకువాడ శ్రీరంగనాథ రాజు
►ఏలూరు - ఆళ్ల నాని
►కృష్ణా - పేర్ని నాని
►ఎన్టీఆర్‌ - వెల్లంపల్లి శ్రీనివాసరావు
►గుంటూరు - డొక్కా మాణిక్య వరప్రసాద్‌
►బాపట్ల - మోపిదేవి వెంకటరమణ
►పల్నాడు - పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
►ప్రకాశం - జంకె వెంకటరెడ్డి
►నెల్లూరు - వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
►కర్నూలు - బీవై రామయ్య
►నంద్యాల - కాటసాని రాంభూపాల్‌రెడ్డి
►అనంతపురము - పైలా నరసింహయ్య
►శ్రీసత్యసాయి జిల్లా - మాలగుండ్ల శంకరనారాయణ
►వైఎస్సార్‌ కడప - కొట్టమద్ది సురేష్‌బాబు
►అన్నమయ్య - గడికోట శ్రీకాంత్‌రెడ్డి
►చిత్తూరు - కె నారాయణస్వామి
►తిరుపతి - నెదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి

చదవండి: (ముస్లిం మైనార్టీలపై బాబు మొసలి కన్నీరు)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement