త్వరలో విడుదల
Published Sat, Oct 29 2016 3:11 PM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM
టీఆర్‌ఎస్ సారథుల ఖరారు
కేసీఆర్‌దే తుది నిర్ణయం
రేపు ప్రకటించే అవకాశం !
కడియం ఇంట్లో ఐదు జిల్లాల నేతల భేటీ
జిల్లా కార్యవర్గాల కూర్పు పూర్తి
సాక్షి, వరంగల్ : టీఆర్‌ఎస్‌లో పార్టీ పదవుల పంపకాల ప్రక్రియ కొలిక్కి వచ్చింది. జిల్లా అధ్యక్షులను అధినేత కేసీఆర్ నిర్ణయించనున్నారు. జిల్లాల వారీగా ముఖ్యనేతల నుంచి ఇప్పటికే ప్రతిపాదనలు తీసుకున్నారు. దీపావళి రోజున కొత్త జిల్లాల అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉంది. పార్టీ జిల్లా అధ్యక్షులతోపాటే కార్యవర్గాలను కూడా ప్రకటించేలా కసరత్తు జరుగుతోది. జిల్లాల కార్యవర్గాల్లో ఎవరెవరిని నియమించాలనే అంశంపై ఐదు జిల్లాల టీఆర్‌ఎస్ నేతలు శుక్రవారం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారిక నివాసంలో ఈ భేటీలు జరిగాయి. ఎమ్మెల్యేలు రాకపోవడంతో వరంగల్ అర్బన్ జిల్లా సమావేశం జరగలేదు.
వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్ జిల్లాల సమావేశాలు పూర్తయ్యాయి. జిల్లా కమిటీల్లో ప్రాతినిథ్యంపై స్పష్టత వచ్చింది. ఏ నియోజకవర్గానికి ఏ పదవి ఇవ్వాలనే విషయంలో ప్రజాప్రతినిధుల మధ్య ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఆయా నియోజకవర్గాలకు కేటాయించిన పదువులకు ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై ఎమ్మెల్యేలకు నిర్ణయాధికారం ఇచ్చారు. ఎమ్మెల్యేలంతా శనివారం ఉదయం పార్టీ పదవుల్లో నియమించే వారి పేర్ల జాబితాను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి ఇవ్వాలని నిర్ణయించారు. అన్ని జిల్లాల కార్యవర్గాల పేర్ల జాబితాను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శనివారం సాయంత్రంలోపు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేయాల్సి ఉంది. అనంతరం జిల్లాల అధ్యక్షులతోపాటు కార్యవర్గాలను ప్రకటించనున్నారు. ఆదివారం రోజే కొత్త కమిటీలను ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పదిలక్షల జనాభా కంటే ఎక్కువ ఉన్న జిల్లాలకు 24 మందితో జిల్లా కార్యవర్గం ఉంటుంది. మిగిలిన జిల్లాలకు 15 మందితో జిల్లా కమిటీ ఉంటుంది. వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్ జిల్లాలకు 15 మందితో కమిటీలు ఉంటాయి. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఒకరు చొప్పన, నలుగురు ప్రధాన కార్యదర్శులు, నలుగురు కార్యదర్శలు, ఐదుగురు కార్యవర్గ సభ్యులతో జిల్లా కార్యవర్గం ఉంటుంది. అన్ని జి ల్లా కమిటీలకు అనుబంధంగా ఎస్సీ, ఎ స్టీ, బీసీ, మైనారిటీ, మహిళా, యువజన, రైతు, కార్మిక, విద్యార్థి కమిటీలు ఉంటా యి. అనుబంధ కమిటీల్లో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ఇద్దరు ప్రధాన కార్యదర్శులు, ఇద్దరు కార్యదర్శులు, నలుగురు సభ్యులు ఉంటారు. ఇలా తొమ్మిది అనుబంధ సంఘాలకు కలిపి 90 మందికి కమిటీల్లో చోటు దక్కుతుంది.
అర్బన్ జిల్లాపై అనిశ్చితి...
మిగిలిన నాలుగు జిల్లాలతో పోల్చితే వ రంగల్ అర్బన్ జిల్లా కమిటీలో ఎక్కువ మందికి చోటు దక్కనుంది. పది లక్షల జ నాభా కంటే ఎక్కువ ఉన్నందున 25 మం దితో వరంగల్ అర్బన్ జిల్లా కమిటీ ఉం టుంది. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ఐదుగురు ప్రధాన కార్యదర్శులు, ఐదుగురు సహాయ కార్యదర్శలు, ఏడుగురు కార్యవర్గ సభ్యులు వరంగల్ అర్బన్ జిల్లా కమిటీలో ఉండనున్నారు. ముఖ్యనేతల గైర్హాజరుతో వరంగల్ అర్భన్ జిల్లా సమావేశం జరగలేదు. గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్, ఎమ్మెల్యేలు అరూరి రమే శ్, టి.రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి ఈ సమావేశానికి వచ్చారు.
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ కొండ మురళీధర్‌రావు హాజరు కాలేదు. ముఖ్యనేతలు హాజరుకాకపోవడంతో అర్బన్ జిల్లా సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా కార్యవర్గంలో చోటు కల్పించే నేతల పేర్లను శనివారం ఉదయం పంపించాలని ఎమ్మెల్యేలకు సూ చించారు. కుడా చైర్మన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి మున్సిపల్ మంత్రి కేటీఆర్ వచ్చే విషయంలో రెండు రోజుల క్రితం జరిగిన పరిణామాల నేపథ్యంలోనే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ ఈ సమావేశానికి వెళ్లనట్లు తెలిసింది.
Advertisement
Advertisement