general secretaries
-
వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శుల నియామకం
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పదవుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు నియామకాలు చేపట్టారు.పార్టీ ప్రధాన కార్యదర్శులు (సమన్వయం)గా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్‌రెడ్డిని నియమించారు. పార్టీ మరో ప్రధాన కార్యదర్శి (అనుబంధ విభాగాలు)గా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నియమించారు. అలాగే కొన్ని అనుబంధ విభాగాలకు కూడా నియామకాలు చేశారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను నియమించారు.బీసీ సెల్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, చేనేత విభాగం అధ్యక్షుడిగా గంజి చిరంజీవి, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పానుగంటి చైతన్యను నియమించారు. ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకు అప్పగించారు. -
మరింత దూకుడు పెంచిన రాహుల్
-
మరింత దూకుడు పెంచిన రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రేపో, ఎల్లుండో చేపట్టేందుకు సిద్ధమైన ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన దూకుడును ప్రదర్శిస్తున్నారు. సోమవారం పార్టీ పార్టీ ప్రధాన కార్యాలయంలో సాధారణ కార్యదర్శలతో సమావేశం ఏర్పాటు చేసిన ఆయన కీలక అంశాలను ప్రస్తావనకు తెచ్చి చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీ వర్గాలు అందించిన సమాచారం మేరకు.. నవంబర్ 8న నిర్వహించబోయే బ్లా డే నిరసన ప్రదర్శనలపైనే ఆయన ప్రధానంగా చర్చించారంట. అయితే అవి సాధారణ రీతిలో కాకుండా కాస్త వైవిధ్యంగా ఉండేలా పలు సూచనలు కూడా రాహుల్ చేసినట్లు చెబుతున్నారు. ఇందుకోసం ఏకే ఆంటోనీ, మోతిలాల్ వోరా జీ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను చాటి చెప్పేలా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని రాహుల్ చెప్పినట్లు ఓ కార్యదర్శి తెలిపారు. ఇక సమావేశం అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడారు. నవంబర్8న(నోట్ల రద్దు ప్రకటించిన రోజు) ఓ విషాదం అని రాహుల్ అన్నారు. జాతి ప్రయోజనాలు, ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకోకుండానే ప్రధాని పెద్దనోట్ల రద్దు నిర్ణయం ప్రకటించారని రాహుల్ విమర్శించారు. కాగా, ఈ సమావేశంలోనే నవంబర్ 19వ తేదీన నిర్వహించబోయే ఇందిరా గాంధీ శత జయంతి ఉత్సవాల నిర్వహణ, అదే తేదీన రాహుల్ కు పగ్గాలు అప్పజెప్పే విషయంపై చర్చ జరిగినట్లు జాతీయ మీడియాలు కథనం వెలువడుతున్నాయి. -
వైఎస్సార్సీపీ ఏపీ విభాగానికి ఎనిమిదిమంది ప్రధాన కార్యదర్శులు
జిల్లాలకు కొత్త అధ్యక్షులు.. నియామకాలు చేసిన జగన్ సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ విభాగానికి 8 మంది ప్రధాన కార్యదర్శులతోపాటుగా పలు జిల్లాలకు కొత్త అధ్యక్షులను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం నియమించారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విడుదలైన ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించారు. ప్రధాన కార్యదర్శులుగా సుజయ్ కృష్ణ రంగారావు, ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంకటరమణ, జంగా కృష్ణమూర్తి, ఎంవీ మైసూరారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, వి.విజయసాయిరెడ్డి, పీఎన్వీ ప్రసాద్ నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షులుగా రెడ్డి శాంతి (శ్రీకాకుళం), కోలగట్ల వీరభద్రస్వామి (విజయనగరం), గుడివాడ అమర్నాథ్ (విశాఖపట్టణం), జ్యోతుల నెహ్రూ (తూర్పు గోదావరి), ఆళ్ల నాని (పశ్చిమ గోదావరి), కె.పార్థసారథి (కృష్ణా -దక్షిణం), కొడాలి నాని (కృష్ణా-ఉత్తరం), మర్రి రాజశేఖర్ (గుంటూరు), బాలినేని శ్రీనివాసరెడ్డి (ప్రకాశం), నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి (నెల్లూరు), బుడ్డా రాజశేఖర్‌రెడ్డి (కర్నూలు), ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి (వైఎస్సార్), శంకరనారాయణ (అనంతపురం), కె.నారాయణస్వామిలను (చిత్తూరు) నియమించారు.