
నల్లగొండ కలెక్టర్‌గా స్మితా సబర్వాల్!
సాక్షి, హైదరాబాద్: సీఎం కె.చంద్రశేఖర్‌రావు కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్న ఐఏఎస్ స్మితా సబర్వాల్ నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా వెళ్లనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గతంలో మెదక్, కరీంనగర్ జిల్లాల కలెక్టర్‌గా పనిచేసిన ఆమె... కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పేషీలో తొలి అధికారిగా నియామకం అయ్యారు.
ప్రస్తుతం ఆమె సీఎం కార్యాలయంలో కీలకమైన నీటి పారుదల, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల బాధ్యతలను నిర్వహిస్తున్నారు. పారిశ్రామికీకరణకు అవసరమైన భూమి గుర్తింపులో చొరవ తీసుకుని.. కలెక్టర్ల నుంచి విస్తృత సమాచారాన్ని సేకరించారు. అయితే నల్లగొండ జిల్లా నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో ఆమెను ఆ జిల్లా కలెక్టర్‌గా నియమించే విషయాన్ని సీఎం పరిశీలిస్తున్నారని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి.