రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ విభాగం అధిపతిగా టక్కర్ | SP Takkar appointed as state bifurcation department chief | Sakshi
Sakshi News home page

రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ విభాగం అధిపతిగా టక్కర్

Published Thu, Mar 20 2014 1:27 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

SP Takkar appointed as state bifurcation department chief

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన పక్రియను ముందుకు తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరించే రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ విభాగాన్ని మరింత పటిష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ విభాగానికి అధిపతిగా ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.పి. టక్కర్‌ను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఈ విభాగంలో ముగ్గురు కార్యదర్శులను నియమించగా, కొత్తగా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పి.వి.రమేశ్‌ను, సాధారణ పరిపాలన (రాజకీయ) కార్యదర్శి ఎన్.శివశంకర్‌ను నియమించారు. అలాగే పది మంది డిప్యూటీ కార్యదర్శులను, ఐదుగురు అసిస్టెంట్ కార్యదర్శులను నియమించనున్నారు. ఈ విభాగంలో ఐదు సెక్షన్లను ఏర్పాటు చేస్తారు. ఇక విభజన పనికి సంబంధించి ఉత్తర ప్రత్యుత్తరాలు, ఆదేశాలు అన్నీ కూడా ఈ విభాగం నుంచే సాగుతాయి. విభజనకు సంబంధించి ఏ అంశంలో మార్గదర్శకాలను జారీ చేయాలన్నా ఈ విభాగం నుంచే చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement