SP Takkar
-
తిరుమలలో చీఫ్ సెక్రటరీ టక్కర్
తిరుమల (అలిపిరి): రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ మంగళవారం తిరుమలకు వచ్చారు. ఇక్కడి పద్మావతి అతిథి గహాల వద్దకు చేరుకున్న ఆయకు టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. 04టీఎంఎల్107–603001 : -
వర్షపు నీటి సంరక్షణకు చర్యలు తీసుకోండి
అనంతపురం అర్బన్: ‘‘ముఖ్యమంత్రి అనుమతితో త్వరలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాము. శాఖలవారీగా రెండంకెలవృద్ధి నివేదికలను, పవర్ పాయింట్ ప్రజంటేషన్ స్లైడ్లను సిద్ధం చేయండి.’’ అని కలెక్టర్లను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.పి.టక్కర్ ఆదేశించారు. అనంతపురం జిల్లాలో భూగర్భ జలాల పెంపునకు వర్షపు నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోన శశిధర్‌ని ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరువుని అధిగమించేందుకు వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ, ఉద్యన పంటల సాగుని అభివృద్ధి చేయాలని రాయలసీమ కలెక్టర్లకు సూచించారు. -
తొలిదశలో 20 శాఖల తరలింపు
-20 హెచ్వోడీలు కూడా తరలి వెళ్లాల్సిన మొత్తం సిబ్బంది 9,750 -లెక్క తేల్చిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: కొత్త రాజధానికి ఉద్యోగుల తరలింపు తొలి దశలో 20 శాఖాధిపతుల కార్యాలయాలు, సచివాలయం నుంచి 20 శాఖలను తరలించాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు తెలిపింది. పురపాలక శాఖ మంత్రి నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్.. సోమవారం సచివాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాజధాని తరలింపు అంశం మీద చర్చించారు. గత వారం చెప్పిన విషయాలనే మళ్లీ ప్రభుత్వం చెప్పిందే తప్ప.. కొత్త విషయాలేమీ లేకపోవడం గమనార్హం. ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న స్థానికతపై స్పష్టత, 30 శాతం హెచ్ఆర్ఏ, తరలింపు అలవెన్స్, 5 రోజుల పనిదినాలు, ఉద్యోగుల వసతి కల్పన.. తదితర అంశాల్లో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేకపోయింది. ముఖ్యమంత్రితో మాట్లాడి చెబుతామంటూ పాత పాటే పాదింది. రాజధానికి తరలి వెళ్లాల్సిన మొత్తం ఉద్యోగుల సంఖ్య 9750 మంది అని ప్రభుత్వ నిర్ధారించింది. తొలి దశలో సచివాలయంలో 20 శాఖలు(20 మంది కార్యదర్శులు, వారికి అనుబంధంగా పనిచేస్తున్న సిబ్బంది), 20 శాఖాధిపతుల కార్యాలయాల(హెచ్‌వోడీల)ను తరలించాలనే యోచనలో ఉన్నామని తెలిపింది. ల్యాండ్ అండ్ రెవెన్యూ, వ్యవసాయం, జల వనరులు, వైద్యం, అటవీ, విద్య శాఖల పరిధిలో 20 హెచ్వోడీలు ఉన్నాయని, వాటిని తొలి దశలో తరలించనున్నట్లు వెల్లడించారు. సచివాలయంలోని ఈ శాఖలకు సంబంధించిన విభాగాలనే తొలుత తరలించనున్నామని తెలిపారు. ఏ కార్యాలయానికి ఎంత స్థలం అవసరం? ఏ కార్యాలయానికి ఎంత స్థలం అవసరం అనే విషయాన్ని నిర్ధారించడానికి ఈనెల 30న వివిధ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లింగరాజ్ పాణిగ్రాహి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో.. కార్యాలయాల వారీగా స్థలాల అవసరాలను నిర్ణయించే అవకాశం ఉంది. 2న మళ్లీ భేటీ ఉద్యోగ సంఘాలు, సచివాలయ నిర్మాణ సంస్థల ప్రతినిధులతో మరో సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 30న జరగనున్న సమావేశంలో నిర్ణయించే అంశాలను ఉద్యోగ సంఘాల ముందు ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ భేటీలో.. తరలింపు విషయంలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. -
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విభాగం అధిపతిగా టక్కర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన పక్రియను ముందుకు తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరించే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విభాగాన్ని మరింత పటిష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ విభాగానికి అధిపతిగా ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.పి. టక్కర్‌ను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఈ విభాగంలో ముగ్గురు కార్యదర్శులను నియమించగా, కొత్తగా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పి.వి.రమేశ్‌ను, సాధారణ పరిపాలన (రాజకీయ) కార్యదర్శి ఎన్.శివశంకర్‌ను నియమించారు. అలాగే పది మంది డిప్యూటీ కార్యదర్శులను, ఐదుగురు అసిస్టెంట్ కార్యదర్శులను నియమించనున్నారు. ఈ విభాగంలో ఐదు సెక్షన్లను ఏర్పాటు చేస్తారు. ఇక విభజన పనికి సంబంధించి ఉత్తర ప్రత్యుత్తరాలు, ఆదేశాలు అన్నీ కూడా ఈ విభాగం నుంచే సాగుతాయి. విభజనకు సంబంధించి ఏ అంశంలో మార్గదర్శకాలను జారీ చేయాలన్నా ఈ విభాగం నుంచే చేస్తారు.