
కాశ్మీర్ డీజీపీగా రాజేంద్రకుమార్
శ్రీనగర్: సీనియర్ ఐపీఎస్ అధికారి కె.రాజేంద్రకుమార్ జమ్మూకాశ్మీర్ కొత్త డీజీపీగా నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అధ్యక్షతన జరిగిన జమ్మూకాశ్మీర్ కేబినెట్ సమావేశం రాజేంద్రకుమార్ నియామకానికి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజేంద్రకుమార్ జమ్మూకాశ్మీర్ క్యాడర్ 1984 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 57 ఏళ్ల రాజేంద్రకుమార్ కాశ్మీర్‌లో పలు కీలక పదవుల్లో పని చేశారు.