వర్సిటీ ఉద్యోగినిపై చాన్స్‌లర్ అత్యాచారం | Alliance University Chancellor Madhukar Angur Arrested on Charges of Rape in Bengaluru | Sakshi
Sakshi News home page

వర్సిటీ ఉద్యోగినిపై చాన్స్‌లర్ అత్యాచారం

Published Sat, Feb 6 2016 9:17 PM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM

వర్సిటీ ఉద్యోగినిపై చాన్స్‌లర్ అత్యాచారం - Sakshi

వర్సిటీ ఉద్యోగినిపై చాన్స్‌లర్ అత్యాచారం

బెంగళూరు: విశ్వవిద్యాలయంలో అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తి ఓ సాధారణ ఉద్యోగినిపై కన్నేశాడు. రెండేళ్లుగా తన కామవాంఛను తీర్చుకుంటున్నాడు. చివరికి బాధితురాలి తల్లి ఫిర్యాదుతో ఆ కామాంధుడు శనివారం కటకటాల వెనక్కు వెళ్లాడు. వివరాలు... స్థానిక అలెయన్స్ విశ్వవిద్యాలయం చాన్స్‌లర్‌గా ఉన్న మధుకర్ జీ అంగూర్ అందులోనే పని చేస్తున్న ఉద్యోగిని (32)ని బెదిరించి రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతుండే వాడు.

ఇటీవల కాలంలో బాధితురాలు శారీరకంగా, మానసికంగా కుంగిపోయింది. దీంతో అనుమానం వచ్చిన బాధితురాలి తల్లి కుమార్తెకు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించగా, అత్యాచారానికి గురైనట్లు తేలింది. దీంతో బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మడివాళ పోలీసులు మధుకర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విషయాన్ని డీసీపీ బోరలింగయ్య ధ్రువీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement