హైదరాబాద్: మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం(మనూ) నూతన చాన్స్‌లర్‌గా ప్రముఖ విద్యావేత్త, కాలమిస్ట్ ఫిరోజ్ భక్త్ అహ్మద్ నియమితులయ్యారు. ఈయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. వర్సిటీ విజిటర్ హోదాలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నియామకాన్ని చేసినట్లు వర్సిటీ అధికారులు గురువారం తెలిపారు.
భారత మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్‌కు ఫిరోజ్ భక్త్ అహ్మద్ స్వయానా మేనల్లుడు. ఈయన బాలల సాహిత్యంపై ఉర్దూ, హిందీ భాషల్లో పలు పుస్తకాలు రాయడంతోపాటుగా ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, కాలమిస్ట్‌గా విధులు నిర్వహించారు. దేశవ్యాప్తంగా మదర్సాల ఆధునీకరణ, ఉర్దూ పాఠశాలల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. 1997లో మనూ ఫౌండేషన్ ప్యానెల్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment