కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్
తిరువనంతపురం: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై తనకు సమాచారం ఇవ్వకుండానే సుప్రీంకోర్టుకు వెళ్లడంపై కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఆ రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. సీఏఏ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలంటూ కేరళలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడంతోపాటు ఈ నెల 13వ తేదీన సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చట్టబద్ధ పాలన కొనసాగేలా చేయడం తన బాధ్యతని, ప్రేక్షకుడిగా చూస్తూ ఊరుకోబోనని బెంగళూరులో ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment