సాక్షి,తాడేపల్లి: సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం ఉదయం సమావేశమైన రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024–25 ఆర్ధిక సంవత్సరానికిగాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదించడంతో పాటు పలు ఇతర నిర్ణయాలు తీసుకుంది.
నంద్యాల జిల్లా డోన్‌లో కొత్తగా హార్టికల్చరల్ పుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. డాక్టర్ వైఎస్‌ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఈ హార్టీకల్చరల్ పాలిటెక్నికల్ కళాశాల పనిచేయనుంది.
దీంతో పాటు డోన్‌లో వ్యవసాయం రంగంలో రెండేళ్ల డిప్లొమా కోర్సుతో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో ఈ కాలేజీ పనిచేయనుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ (ఎస్టాబ్లిస్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్ 2016కు సవరణలు చేయడం ద్వారా బ్రౌన్‌ఫీల్డ్ కేటగిరిలో మూడు ప్రైవేట్ యూనివర్శిటీలకు కేబినెట్ అనుమతిచ్చింది.
అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచార్య యూనివర్శిటీ, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి గ్లోబల్ యూనివర్శిటీ, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్శిటీల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటు గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఇదీ చదవండి.. బడుగు బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ : బుగ్గన
Comments
Please login to add a commentAdd a comment