ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వక్ఫ్ చట్టానికి సవరణలు చేసి, తద్వారా వక్ఫ్ బోర్డు అధికారాలను పరిమితం చేసేందుకు సిద్ధంగా ఉందని జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ చట్టంలోని సవరణలకు ఇప్పటికే మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం.
ఈ సవరణలతో ఇవి తమ ఆస్తులని వక్ఫ్ బోర్డ్ అంటే అందుకు తగిన ఆధారాలు చూపుతూ ధృవీకరించాల్సి ఉంటుందని సమాచారం. ఈ సవరణలకు సంబంధించిన బిల్లును వచ్చే వారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా వక్ఫ్ బోర్డుకు సుమారు 9.4 లక్షల ఎకరాలు భూమి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment