
భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అభివృద్ధిని ప్రోత్సహించడానికి కేంద్ర మంత్రివర్గం నేడు (గురువారం) రూ. 10371.92 కోట్ల బడ్జెట్ వ్యయంతో జాతీయ-స్థాయి 'ఇండియాఏఐ' (IndiaAI) మిషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచం ఏఐలో దూసుకువెళ్తున్న సమయంలో మన దేశం కూడా ఈ రంగంలో తప్పకుండా ఎదగాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పలుమార్లు ప్రస్తావించారు. నేడు దీనికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది.
మేకింగ్ ఏఐ వర్క్ ఫర్ ఇండియా అనే విజన్‌తో మన దేశంలో కూడా టెక్నాలజీ పెరగాలని క్యాబినెట్ భారీ బడ్జెస్ట్ ప్రకటించింది. ఇండియాఏఐ మిషన్ సామాజిక ప్రయోజనం కోసం విప్లవాత్మక సాంకేతికత అనువర్తనాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించడానికి సహాయపడుతుంది. భారత్ ప్రపంచంలో పోటీ పడటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment